అశ్విన్ మ్యాజిక్, జైశ్వాల్, రోహిత్ మెరుపు ఇన్నింగ్స్- డొమినికా టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం
అశ్విన్, జడేజా స్పిన్ ద్వయం సొంత గ్రౌండ్‌లోని విండీస్‌కు చుక్కలు చూపించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లు ఏమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది.
ఐసీసీ టెస్ట్ బౌలింగ్‌లో టాప్ ర్యాంక్‌లో ఉన్న అశ్విన్ మరోసారి తన మ్యాజిక్‌తో విండీస్‌పై అద్భుతం చేశాడు. టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డొమినికాలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 24.3 ఓవర్లు వేసి అరవై పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో 64.3 ఓవర్లు ఆడిన విండీస్150 పరుగులు మాత్రమే చేసింది. అశ్విన్‌కు జడేజా కూడా తోడుయ్యాడు. జడేజా 14 ఓవర్లు విసిరి 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
అశ్విన్, జడేజా స్పిన్ ద్వయం సొంత గ్రౌండ్‌లోని విండీస్‌కు చుక్కలు చూపించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లు ఏమీ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ 65 బంతుల్లో 30 పరుగులు చేశాడు. టెస్టులలో అరంగేట్రం చేసిన యశస్వి జైశ్వాల్ 73 బంతులు ఎదుర్కొని 40 పరుగులతో ఆడుతున్నాడు. విండీస్ చేసిన పరుగులకు 70 పరుగులు వెనుకబడి ఉంది టీమిండియా.
పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తున్నారు ఓపెనింగ్ జోడి అద్భుతమైన సహనంతో చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ మంచి స్కోర్లనే చేసింది. రోహిత్ శర్మ తన స్టైల్ మార్క్ షాట్లతో నిలదొక్కున్నాడు. అటు జైశ్వాల్‌లో మొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాను అనే ఫీలింగ్ లేకుండా ఆడాడు.
మొదటి రోజు హీరో మాత్రం అశ్విన్ అని చెప్పవచ్చు. అతని కళాత్మకతమైన బౌలింగ్ లైనప్‌తో విండీస్‌ను పడగొట్టేశాడు. బ్యాటర్లు నిలదొక్కునే ఛాన్స్ లేకుండా చేశాడు. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యేక ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్ 700 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ విషయంలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. కుంబ్లే 700 వికెట్లు పడగొట్టాడు.
డొమినికా టెస్టులో టాస్ గెలిచిన విండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు 150 పరుగులు మాత్రమే చేసి అలౌట్ అయింది. భారత బౌలర్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ , తేజ్‌నారాయణ్ చందర్‌పాల్, అలీక్, అల్జారీ జోసెఫ్, జోమెల్ వారికెన్‌ను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 700 అంతర్జాతీయ వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే నిలిచాడు. తన కెరీర్లో 956 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో హర్భజన్ సింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. భజ్జీ 711 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అశ్విన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ కేసులో కపిల్ దేవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. కపిల్ 687 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ 610 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌కు ప్రామిసింగ్ స్టార్ట్ లభించింది. మొదటి 12 ఓవర్ల పాటు ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (20: 46 బంతుల్లో, మూడు ఫోర్లు), తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (12: 44 బంతుల్లో) వికెట్ ఇవ్వకుండా ఆపారు. మొదటి వికెట్‌కు వీరు 31 పరుగులు జోడించారు. ఈ దశలో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను అవుట్ చేసి అశ్విన్ భారత్‌కు మొదటి వికెట్ అందించాడు. దీంతో అశ్విన్ ఒక ప్రత్యేకమైన రికార్డు కూడా సాధించాడు. 2011లో తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ తండ్రి శివ్‌నారాయణ్ చందర్‌పాల్‌ను అశ్విన్ అవుట్ చేశాడు. తండ్రీ కొడుకులు ఇద్దరినీ అవుట్ చేసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు.
కాసేపటికే క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను కూడా అవుట్ చేసి అశ్విన్ రెండో వికెట్ కూడా పడగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. అశ్విన్‌కు మిగతా బౌలర్ల నుంచి చక్కటి సపోర్ట్ లభించింది. ఆరో వికెట్‌కు ఆలిక్ అథనజే (47: 99 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), జేసన్ హోల్డర్ (18: 61 బంతుల్లో, ఒక ఫోర్) జోడించిన 41 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నా వెస్టిండీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు.
లంచ్ సమయానికి వెస్టిండీస్ నాలుగు వికెట్ల నష్టానికి జోడించింది. రెండో సెషన్‌లో కూడా వెస్టిండీస్ పరిస్థితి మెరుగుపడలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో టీ బ్రేక్‌కు ఎనిమిది వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. మూడో సెషన్‌లో కేవలం 13 పరుగులే జోడించి ఆఖరి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది.