భారతీయ భాషల్ని అనువదించే స్పెషల్ AI పోర్టల్ భాషిణి, త్వరలోనే అందుబాటులోకి
Digital India: డిజిటల్ ఇండియాలో భాగంగా లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ పోర్టల్ భాషిణిని భారత్ తయారు చేస్తోంది.
Digital India:
జీ20 డిజిటల్ ఎకానమీ సదస్సు..
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బెంగళూరులో జరుగుతున్న G20 Digital Economy సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని...ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే భారత్ AI టెక్నాలజీతో ఓ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ ప్లాట్‌ఫామ్‌ని తయారు చేస్తోందని వెల్లడించారు. భారత్‌లోని భాషా వైవిధ్యానికి తగ్గట్టుగా ఇది అన్ని భాషల్లోనూ తయారవుతోందని చెప్పిన ప్రధాని ఈ ప్లాట్‌ఫామ్‌కి "భాషిణి (Bhashini)" అనే పేరు పెట్టినట్టు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్ డేటా అందిస్తున్న దేశం భారత్ మాత్రమే అని చెప్పిన ఆయన త్వరలోనే ఇండియాలో డిజిటలైజేషన్ ఊహించిన దాని కన్నా వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
VIDEO | "We are building 'Bhashini', an AI powered language translation platform. It will support digital inclusion in all the diverse languages of India," says PM Modi in his virtual address at G20 Digital Economy Ministers' meeting in Bengaluru.
— Press Trust of India (@PTI_News) August 19, 2023
(Source: Third Party) pic.twitter.com/cQqHBxDkQj
భారత్‌లో ప్రస్తుతానికి 85 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని, వీళ్లందరూ తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటాని పొందుతున్నారని వెల్లడించారు. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా...భాషిణి పోర్టల్ ద్వారా ఇప్పుడున్న 10 భారతీయ భాషలతో పాటు, మొత్తం 22 భాషల్లోకి ట్రాన్స్‌లేషన్ వెసులుబాటు కలుగుతుంది.
VIDEO | “Today, India has over 850 million internet users enjoying some of the cheapest data costs in the world,” says PM Modi in his virtual address at the G20 Digital Economy Ministers' meeting in Bengaluru. pic.twitter.com/cP8pPp3sLj
— Press Trust of India (@PTI_News) August 19, 2023
ఏంటీ భాషిణి..?
డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ భాషిణి పోర్టల్‌ని తయారు చేస్తోంది కేంద్రం. భారతీయ భాషల మధ్య ఉన్న బ్యారియర్స్‌ని తొలగించి అన్ని భాషల్నీ అనుసంధానించాలన్నదే ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు...ఈ పోర్టల్‌ని సులువుగా వినియోగించుకునేలా తయారు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న AI టెక్నాలజీతో ఇది రూపు దిద్దుకుంటోంది. సొంత భాషలోనే డిజిటల్ సర్వీస్‌లను వినియోగించుకునేలా ఇది తోడ్పడుతుంది. అన్ని ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో సునో ఇండియా, లిఖో ఇండియా, బోలో ఇండియా, దేఖో ఇండియా అనే ఆప్షన్స్ ఉంటాయి. ఓ తెలియని భాషను విన్నప్పుడు వెంటనే దాన్ని ఈ పోర్టల్‌లో టైప్ చేస్తే...అందుకు తగ్గట్టుగా టెక్స్ట్, ట్రాన్స్‌లేషన్ అందులో కనిపిస్తాయి. అంటే తెలియని భాష గురించి తెలిసిన భాషలో నేర్చుకోవడానికి వీలుంటుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో 22 అధికారిక భాషలున్నాయి. 122 ఎక్కువగా వినియోగించే భాషలతో పాటు 1,599 ఇతర భాషలున్నాయి. అయితే...ప్రస్తుతం ఇంటర్నెట్లోని కంటెంట్ ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే ఉంటోంది. ఇలా కాకుండా అన్ని స్థానిక భాషల్లోనూ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో తయారు చేసిందే భాషిణి పోర్టల్. డేటా తక్కువ ధరకే లభిస్తుండడం, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం వల్ల ఈ పోర్టల్‌తో చాలా ఉపయోగాలుంటాయని కేంద్రం భావిస్తోంది. National Language Translation Mission (NLTM) ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది.
Also Read: Watch Video: ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ట్రైన్లో నుంచి మంటలు, ఉలిక్కిపడ్డ ప్రయాణికులు