Watch Video: ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ట్రైన్లో నుంచి మంటలు, ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
Watch Video: బెంగళూరులో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ఉదయన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.
Watch Video:
ఉదయన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
బెంగళూరులోని సంగొల్లి రాయణ్ణ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న ఉదయన్ ఎక్స్‌ప్రెస్‌లో (Udayan Express) నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టేషన్‌లోని ప్రయాణికులతో సహా సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. ప్రయాణికులంతా దిగిపోయిన రెండు గంటల తరవాత ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని South-Western Railway అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉదయం7.30 గంటలకు పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. స్టేషన్ అంతా పొగ కమ్ముకుంది. రెండు కోచ్‌లు మంటల్లో తగలబడిపోయాయి. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు.
#WATCH | Bengaluru, Karnataka: Fire broke out in Udyan Express after it reached Sangolli Rayanna Railway Station. The incident happened 2 hours after passengers deboarded the train. No casualties or injuries. Fire engine and experts reached the spot and asserting the situation.… pic.twitter.com/laBLreFDgI
— ANI (@ANI) August 19, 2023
తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లోనూ..
మహారాష్ట్రలోనూ ఇలాంటి ప్రమాదమే వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. నాగ్‌పూర్ సమీపంలో S-2 బోగీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఎక్కువవడం వల్ల కొంత మంది ప్రయాణికులు ట్రైన్ దిగి పరుగులు పెట్టారు. అయితే...ఈ ఘటనలో ప్రాణనష్టం నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు.
Just a few minutes of peril between pandhurna and darimeta .... Already the train was delayed for 4 hours and this shows the poor maintenance and accountability of Indian railways.@IRCTCofficial@AshwiniVaishnaw @irctcsczone Telangana Express- 12724 pic.twitter.com/VctubIMHVP
— krishna prasad (@krishnaprasad2o) August 19, 2023
వందేభారత్‌లో మంటలు..
ఇటీవల తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో పొగ రావడం అందర్నీ ఉరుకులు పరుగులు పెట్టించింది. పొగ రావడం గమనించిన ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైలును నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ లో నిలిపివేయాల్సి వచ్చింది. వెంటనే వాకీటాకీల ద్వారా సమాచారాన్ని చేరవేసుకొని అధికారుల సూచనల మేరకు రైలును నిలిపివేశారు. ఆ వెంటనే ప్రయాణికులను కూడా బోగీల్లో నుంచి కిందకి దింపేశారు. ముందు నుంచి మూడో భోగీలో పొగలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తీరా ఆ బోగీలోకి వెళ్లి అంతా పరిశీలించగా, మూడో బోగీ బాత్ రూమ్ నుంచి పొగలు వచ్చినట్లుగా గుర్తించారు. బాత్ రూమ్‌లో కాల్చి పారేసిన సిగరెట్ ముక్కను ఆర్పకుండా వేయడం వల్ల పొగ వ్యాపించిందని తేల్చారు. ఈ పని చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అంతేకాక, అతనికి టికెట్ కూడా లేదని తేల్చారు. ఆ ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తారా? ప్రధాని మోదీని ఢీకొట్టనున్నారా?