A Product Of Scholarship System : ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్రి నా స్థోమత కాదు - మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రాన్నే సబ్జెక్ట్ గా ఎందుకు ఎంచుకున్నారంటే!
A Product Of Scholarship System : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చదువులో రాణించారు. కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలకు వెళ్లారు. భారతదేశం ఎందుకు పేద దేశంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఆర్థిక శాస్త్రాన్ని తన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నారు.
A Product Of Scholarship System : గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబరు 26న మరణించారు. ఆయన్ను భారతదేశం "ప్రపంచంలోనే అత్యంత అర్హత కలిగిన ప్రభుత్వాధినేత"గా పరిగణించింది. చిన్నతనం నుంచే అపారమైన జ్ఞాపకశక్తి, తెలివితేటలు కలిగి ఉన్న మన్మోహన్.. 1947లో విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చారు. మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. అప్పట్లో ఆయన కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన చదువును కొనసాగించారు. ఆ సమయంలో మన్మోహన్ వయసు 15సంవత్సరాల. ఎంతో కష్టపడి చదువునభ్యసించిన ఆయన.. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు.
కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం ఎలా సాధ్యమైందంటే..
పేద కుటుంబంలో జన్మించినప్పటికీ, అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ తాను కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీల్లో ఎలా చదవగలిగానో 2004లో ఓ టాక్ షో అమెరికన్ జర్నలిస్ట్ చార్లీ రోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ వెల్లడించారు. ఆయన భారత ప్రధాని అయిన సుమారు 4 నెలల తర్వాత ఈ వివరాలను అందించారు. విభజన తర్వాత పాకిస్థాన్‌లో భాగమైన నపంజా అనే గ్రామంలో మన్నోహన్ పెరిగారు. అప్పట్లో ఈ ప్రాంతానికి మంచి నీరు, విద్యుత్‌లాంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. "నేను పశ్చిమ పంజాబ్‌లోని ఒక గ్రామంలో పుట్టాను. నేను చాలా పేద వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాను. మా కుటుంబంలోని చాలా మంది గ్రామం వెలుపల ఉద్యోగాల కోసం బయటకు వెళ్లారు" అని ఆయన చెప్పారు. 60 సంవత్సరాల చరిత్ర గల ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నానన్నారు. అది ఇప్పటికీ ఉందని చార్లీ రోజ్ చెప్పడంతో మన్మోహన్ ఆశ్చర్యపోయారు.
కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్య కోసం లండన్‌కు ఎలా వెళ్లగలిగారు అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మన్మోహన్.. మన స్కాలర్ షిప్ సిస్టమ్ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. అది లేకుండా తన చదువు సాధ్యం కాకపోయేదని చెప్పారు. "నా వద్ద ఉన్న సోర్సెస్ తో నేను ఆక్స్‌ఫర్డ్ గానీ, కేంబ్రిడ్జ్‌కి గానీ వెళ్లే స్థోమత లేదు. అందుకే నా తల్లిదండ్రులు కూడా నన్ను పంపలేకపోయారు. కానీ నేను భారతదేశంలో నిర్వహించిన పరీక్షల్లో బాగా రాణించాను. అందుకే నేను స్కాలర్‌షిప్‌ను గెలుచుకోగలిగాను" అని సింగ్ గుర్తుచేసుకున్నారు. "కేంబ్రిడ్జ్‌లోనూ నా చదువులో రాణించాను. అలా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నాకు ఫెలోషిప్ ఇచ్చింది. అందుకే నేనంటాను నేనో స్కాలర్‌షిప్ సిస్టమ్ ప్రొడక్ట్"ని అని ఆయన చెప్పారు. రోజ్ దీన్ని "ఒక మెరిటోక్రసీ" అని పిలిచారు. దీన్ని సింగ్ కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే తనను తాను చాలా అదృష్టవంతుడినని మన్మోహన్ చెప్పుకున్నారు. ఎందుకంటే అందరికీ ఈ అవకాశాలు లభించవని అన్నారు.
ఆర్థిక శాస్త్రాన్నే సబ్జెక్ట్ గా ఎందుకు ఎంచుకున్నారంటే..
ముఖ్యంగా ఆర్థిక శాస్త్రాన్నే సబ్జెక్ట్ గా ఎందుకు ఎంచుకున్నారన్న దానిపై మాట్లాడిన మన్మోహన్ సింగ్..
15, 16 సంవత్సరాల వయసులో కఠోరమైన పేదరికం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పట్లో మన దేశంలో చాలా ప్రసిద్ధ రచయిత నినో మసామిల్ (ph) రాసిన ఒక పుస్తకం ఉండేది. దాని పేరు అవర్ ఇండియా (Our India). అది మా స్కూల్ టెక్ట్స్‌లో ఉండేది. ఆ పుస్తకంలోని మొదటి వాక్యం ఏముందంటే ప్రతి ఐదుగురిలో ఒక వ్యక్తి భారతీయుడుగా ఉంటారు అని. ఇంకా ఇది భారతదేశం చాలా పేద ప్రజలు నివసించే ధనిక దేశంగా ఉందని నిర్ధారించింది. దీనికి కారణాలను అర్థం చేసుకోవడానికి, భారతదేశం ఎందుకు ఇంత పేద దేశంగా ఉంది, ఎందుకు ఇంత పేదరికం ఉంది అన్న విషయాలు నన్ను చాలా ఆలోచించేలా చేశాయి. అవే నన్ను ఆర్థిక శాస్త్ర అధ్యయనానికి దారితీసింది అని మన్మోహన్ వెల్లడించారు. చరిత్రను మార్చగల సత్తా ఉన్నందున ఇప్పుడు మీరు ఏమి చేస్తారని అడిగిన ప్రశ్నకు, ఆ స్థానం తనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందని, ఎప్పుడూ ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వ కార్యాలయాన్ని ఓ ప్రైవేట్ విద్యగా పరిగణిస్తానని సింగ్ అంగీకరించాడు.
Also Read : Manmohan Singh Death: మన్మోహన్ సింగ్ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం