అన్వేషించండి

Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

former PM Manmohan Singh Dies | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల దేశ వ్యాప్తంగా సంతాపం తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని ప్రకటించింది.

7 day mourning in honour of former PM Manmohan Singh | న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూయడం తెలిసిందే. దేశం ఓ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, గొప్ప మేధావిని, చేతల మనిషిని కోల్పోయింది. మన్మోహన్ సింగ్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో దేశ వ్యాప్తంగా డిసెంబర్ 26 నుంచి జనవరి 1వ తేదీ వరకు 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ లాంఛనాలతో శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

నేడు కేబినెట్ భేటీలో సంతాపం

మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ కేబినెట్ భేటీలో దివంగత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతికి కేంద్ర మంత్రివర్గం సంతాపం తెలపనుంది. దేశం కష్టాల్లో ఉన్న సమయంలో తన ఆర్థిక విధానాలతో కొత్త పుంతలు తొక్కించిన మన్మోహన్ అంటే అన్ని పార్టీలకు ఇష్టమే. ఆయనను గొప్ప మేథావిగా, ఆర్థిక చాణక్యుడిగా పేర్కొంటారు. కాగా, మన్మోహన్ సింగ్‌కు భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

గత కొన్నేళ్లుగా వయసురీత్యా అనారోగ్య కారణాలతో మన్మోహన్ సింగ్ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన మన్మోహన్ సింగ్‌ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. కానీ వైద్యుల ఫలితాలు ప్రయత్నించలేదు, ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో మన్మోహన్ తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి 9.51 గంటలకు కన్నుమూశారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. 

దేశాన్ని నిలబెట్టిన మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు 
1990వ దశకం భారత్‌కు గడ్డు కాలం. కానీ పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్‌ సింగ్‌ తన మేథస్సుతో దేశాన్ని పెద్ద గండం నుంచి గట్టెక్కించారు. ప్రధానిగా ఆ సమయంలో పీవీకి ఎంత ప్రాధాన్యత దక్కిందో, ఆ ఆర్థిక సంస్కరణల నిర్ణయాలు తీసుకున్న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ను అంతే స్మరించుకుంటున్నాం. అపార మేధావి, ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా యూపీఏ సర్కార్‌ను నడిపించారు. నెహ్రూ, గాంధీయేతర కుటుంబాల నుంచి పదేళ్లపాటు ప్రధానిగా సేవలు అందించిన తొలి నేతగా మన్మోహన్ నిలిచారు.

Also Read: Manmohan Singh Property: లెక్చరర్‌ నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన మన్మోహన్ సంపాదించిన ఆస్తులెన్ని? ఆయన ఏం చదువుకున్నారు?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
Garlic in Winter : చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎలా తీసుకుంటే మంచిదో చెప్పిన నిపుణులు
చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎలా తీసుకుంటే మంచిదో చెప్పిన నిపుణులు
Embed widget