అన్వేషించండి

Manmohan Singh Property: లెక్చరర్‌ నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన మన్మోహన్ సంపాదించిన ఆస్తులెన్ని? ఆయన ఏం చదువుకున్నారు?

Manmohan Singh Death: రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీగఢ్‌లో ఫ్లాట్ ఉంది. ఎలాంటి అప్పులు లేవు.

Manmohan Singh Death:మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పని చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయం, పని పట్ల నిబద్ధతత చాటుకొని రాజకీయ నాయకులకు రోల్‌మోడల్‌గా నిలించారు. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రధానమంత్రి పదవిని వీడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో నివసిస్తున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, భార్య గురుశరణ్ కౌర్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

మాజీ ప్రధాని చాలా సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడేవారు, చాలా తక్కువగా మాట్లాడేవారు. ఆయన ఆస్తుల గురించి చెప్పాలంటే... ఆస్తుల విలువ రూ.15 కోట్ల 77 లక్షలు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. ఢిల్లీ, చండీగఢ్‌లో ఆయనకు ఫ్లాట్ ఉంది. అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్ కు ఎలాంటి అప్పులు లేవు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలు

డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న నాటి పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1962లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో డి.ఫిల్ చేశారు. 

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో తన వృత్తిని ప్రారంభించారు. ఇక్కడ లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చారు. 1960లో భారతదేశంలోని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా పనిచేశారు.

1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయికి చేరుకున్నారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా చేరారు. తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా; ప్రధానమంత్రికి సలహాదారుగా; యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా ఏ పదవిలో చేరిన అక్కడ తన బెస్ట్ ఇవ్వడం మన్మోహన్ సింగ్‌కు చెల్లింది. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా పని చేశారు. అప్పుడే అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అవి నేటికి ఆదర్శంగా మారాయి. 2004 లో భారతదేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. 2009లో రెండవసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 

Also Read: పొలిటికల్ 'పండిట్' మన మన్మోహన్ సింగ్ - దేశ గతిని మార్చిన ఆర్థికవేత్త

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget