Manmohan Singh Death: పొలిటికల్ 'పండిట్' మన మన్మోహన్ సింగ్ - దేశ గతిని మార్చిన ఆర్థికవేత్త
Manmohan Singh Education : మన్మోహన్ సింగ్ వినయం విధేయత కలిగిన రాజకీయ నాయకుడే కాదు... ఆయనో దేశ గతి మార్చిన ఆర్థిక మంత్రి, రోల్‌మోడల్‌గా నిలిచిన ప్రధానమంత్రి
Manmohan Singh: డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తదుపరి విద్యను అభ్యసించారు. 1957లో ఆర్థికశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. తరువాత 1962లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో డి.ఫిల్ చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య శ్రీమతి గురుశరణ్ కౌర్‌లకు ముగ్గురు కుమార్తెలు.
భారతదేశ పద్నాలుగో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వినయం, పని పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందారు. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరిన మన్మోహన్ సింగ్.. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. డా. సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్; ప్రధాన మంత్రికి సలహాదారు; యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా పని చేశారు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. ఈ సమయం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎన్నో సత్కారాలు అందుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేక అవార్డులు, గౌరవాలు ఆయన్ని వరించాయి. వాటిలో ముఖ్యమైంది భారతదేశం రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ (1987); ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జవహర్‌లాల్ నెహ్రూ బర్త్ సెంటెనరీ అవార్డు (1995); ఆసియా మనీ అవార్డు (1993, 994); యూరో మనీ అవార్డు (1993), కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆడమ్ స్మిత్ ప్రైజ్ (1956); సెయింట్ జాన్స్ కాలేజీ, కేంబ్రిడ్జ్‌లో విశిష్ట ప్రదర్శనకు రైట్ ప్రైజ్ (1955). జపాన్ నిహాన్ కీజాయ్ షింబున్, ఇతర సంఘాలు పిలిచి సత్కరించాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ , అనేక ఇతర విశ్వవిద్యాలయాలు గౌరవ డిగ్రీలు ప్రదానం చేశాయి.
Also Read: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత