Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు
Ambati Rambabu News: తెలంగాణ ప్రభుత్వంపై అంబటి రాంబాబు సంచలన ట్వీట్ చేశారు. సినిమా ప్రముఖులతో సమావేశంపై సోషల్ మీడియా పోస్టు పెట్టారు.
Ambati Rambabu Social Media Post Against Revanth Reddy: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలపై తరచూ విమర్శలు చేసే వైసీపీ నేత అంబటి రాంబాబు ఈసారి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. సినీ ప్రముఖులు ఆయనతో భేటీ అయిన టైంలో ఓ సెటైరిక్ పోస్టు పెట్టారు. ఎక్స్ వేదికగా పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాల్సిందేనంటూ రాసుకొచ్చారు.
పుష్ప-2లో "సోఫా" సీన్స్ ఉంటాయి. తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను కొనేందుకు, తనకు అనుకూలంగా పని చేసే వాళ్లకు పుష్పరాజ్ "సోఫా" పంపిస్తుంటారు. అందులో భారీ స్థాయిలో డబ్బు ఉంచి పంపిస్తుంటారు. అదే అంశాన్ని అంబటి రాంబాబు ప్రస్తావించారు. అంటే డబ్బులు ఇస్తే సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరిస్తామంటూ అర్థం వచ్చేలా ఆయన ఈ ట్వీట్ చేశారు.
పూర్తి పరిష్కారానికి
— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2024
"Sofa" చేరాల్సిందే!
సంధ్య థియేటర్ కేసులో మొదటి నుంచి అల్లు అర్జున్‌ను వైసీపీ వెనకేసుకొచ్చింది. అల్లు అర్జున్‌ను అనవసరంగా రేవంత్ ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆరోపించింది. ఇందులో ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పాత్ర ఉందని విమర్శలు కూడా చేసింది.