Kohli World Record: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయి.. భారీ తేడాతో వరల్డ్ రికార్డు
Kohli 14000 Odi runs: ఇన్నింగ్స్ 13వ ఓవర్లలో రవూఫ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా అత్యంత వేగంగా 14వేల వన్డే పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.

India vs Pakistan, Champions Trophy 2025 Live Updates: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 14 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లలో హరీస్ రవూఫ్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ముందు వరకు వన్డే కెరీర్లో 13, 985 పరుగులతో ఉన్న కోహ్లీ.. ఈ మ్యాచ్ ద్వారా అత్యంత వేగంగా 14వేల వన్డే పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.
14వేల క్లబ్బులో ఇప్పటివరకు కేవలం ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ క్లబ్బును ప్రారంభించగా, శ్రీలంక లెజెండరీ కెప్టెన్ కుమార సంగక్కర మాత్రమే అందులో స్థానం సంపాదించాడు. సచిన్ టెండూల్కర్ తన 350 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిన చేరుకుని అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయిన చేరుకున్నాడు. ఇక 378వ ఇన్నింగ్స్ లో సంగక్కర ఈ మార్కును చేరుకున్నాడు. అయితే చాలా భారీ తేడాతో ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.
1⃣4⃣0⃣0⃣0⃣ ODI RUNS for Virat Kohli 🫡🫡
— BCCI (@BCCI) February 23, 2025
And what better way to get to that extraordinary milestone 🤌✨
Live ▶️ https://t.co/llR6bWyvZN#TeamIndia | #PAKvIND | #ChampionsTrophy | @imVkohli pic.twitter.com/JKg0fbhElj
63 ఇన్నింగ్స్ తేడాతో..
ఈ మ్యాచ్ ముందువరకు కెరీర్ లో 298 వన్డేలు ఆడిన కోహ్లీ.. 286 ఇన్నింగ్స్ లో 13, 985 పరుగులు చేశాడు. 57.78 సగటుతో 50 సెంచరీలు , 73 అర్థ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్ లో మరో 15 పరుగులు సాధించి, 287వ ఇన్నింగ్స్ లో 14 వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. దీంతో 63 ఇన్నింగ్స్ భారీ తేడాతో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఇదే మ్యాచ్ లో ఇప్పటికే మరో భారత రికార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. ఇండియా తరపున అత్యధిక క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గా నిలిచాడు. 158 క్యాచ్ లతో భారత్ తరపున అత్యధిక క్యాచులు పట్టిన భారత ఫీల్డర్ గా రికార్డులకెక్కాడు.
డేంజర్లో సంగకర్క..
వన్డేల్లో రెండో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ రికార్డుపైనా కోహ్లీ కన్నేశాడు. కోహ్లీ కంటే సచిన్ (18,426 రన్స్ ), సంగక్కర్ (14, 234 పరుగులు) మాత్రమే ముందున్నారు. మెగాటోర్నీలో ఇదే తరహా ఆటతీరు కొనసాగిస్తే, సంగక్కరను అధిగమించి టాప్-2లో కోహ్లీ నిలిచే అవకాశముంది. అయితే కెరీర్ చరమాంకంలో పడటతోపాటు , టీమిండియా అంతగా వన్డేలు ఆడ లేక పోతుండడంతో కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. అయితే వన్డేల్లో 50 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా కోహ్లీ.. సచిన్ రికార్డు (49)ని ఇప్పటికే బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.




















