అన్వేషించండి

Actress Anshu: నటి అన్షు తలకు ఏమైంది? - 'మజాకా' ట్రైలర్ ఈవెంట్‌లో గాయంతో మన్మథుడు హీరోయిన్, డెడికేషన్ అంటే ఇదే!

Anshu Head Injury: యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ 'మజాకా'. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నటి అన్షు తలకు చిన్న బ్యాండేజ్‌తో కనిపించగా.. ఆమెకు ఏదైనా గాయమైందా.? అంటూ ఆరాలు మొదలయ్యాయి.

Anshu Appears With Head Injury In Mazaka Trailer Launch Event: యంగ్ హీరో సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'మజాకా'. ఈ మూవీలో రీతూవర్మ, అన్షు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మూవీ టీం పాల్గొనగా.. నటి అన్షు తలకు చిన్న బ్యాండేజ్‌తో కనిపించారు. దీంతో ఆమెకు ఏమై ఉంటుందా.? అని అంతా ఆరా తీస్తున్నారు. సెట్‌లో ఏమైనా గాయాలయ్యాయా.?, అని చర్చించుకుంటున్నారు. దీనిపై అన్షు స్పందించాల్సి ఉంది. చిన్న చిన్న కారణాలకే ప్రమోషన్స్ తప్పించుకునే వారికి ఆమె ఆదర్శమని.. చిన్న గాయంతోనూ ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొనడంపై అన్షు డెడికేషన్ అదుర్స్ అంటూ ప్రశంసిస్తున్నారు.

తనను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావుకు థ్యాంక్స్ చెప్పారు నటి అన్షు. 'హీరో సందీప్ కిషన్ సెట్‌లో ఎంతో ఫన్నీగా ఉంటారు. రావు రమేశ్ గారు ఓ ఎన్ సైక్లోపీడియా. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. రీతూ వర్మ అద్భుతమైన కోయాక్టర్. ఈ మూవీ టీంతో పని చేస్తుంటే నా ఫ్యామిలీతో పని చేసినట్లే అనిపించింది.'  అని అన్షు తెలిపారు.

తెలుగులో రెండే సినిమాలు.. మంచి గుర్తింపు

కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకులకు మరింతగా దగ్గరవుతారు. అలాంటి వారిలో అన్షు ఒకరు. 20 ఏళ్ల క్రితం వచ్చిన నాగార్జున మన్మథుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అన్షు.. తన అందం, అభినయం, నటన, అమాయకత్వపు చూపులతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత వెంటనే 2003లో ప్రభాస్ రాఘవేంద్ర మూవీలో నటించారు. అనంతరం ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు 'మజాకా'తో రీఎంట్రీ ఇచ్చారు.

Also Read: సెన్సిటివ్ కథాంశంతో ప్రియదర్శి లేటెస్ట్ ఫిక్షనల్ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' - మార్చి 14న థియేటర్లలోకి.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్.?

ఈ నెల 26న 'మజాకా' రిలీజ్ 

'థమాకా' ఫేం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మజాకా'.. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. 'ఇంట్లో చెట్టంత కొడుకుని పెట్టుకుని, ఆంటీలని పోయి గోకుతావా?' అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా.. రీతూవర్మ వెంట సందీప్ కిషన్ పడటం, తన కొడుకును ఫాలో అవుతూ రావు రమేష్ కూడా అన్షు వెంట పడటం చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్ చేస్తుందని తెలుస్తోంది. ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే ఫన్ రైడ్ లాంటి సినిమా 'మజాకా' అని హీరో సందీప్ కిషన్ అన్నారు. ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ అని.. గతంలో తాను చేసిన సినిమాల్లో కామెడీ క్యారెక్టర్లు చేసినా.. ఇందులో మాత్రం పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు. 

Also Read: ప్రియమణి మలయాళ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' - త్వరలోనే ఆ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget