Court Movie On OTT: సెన్సిటివ్ కథాంశంతో ప్రియదర్శి లేటెస్ట్ ఫిక్షనల్ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' - మార్చి 14న థియేటర్లలోకి.. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్.?
Court - State vs A Nobody OTT Platform: యంగ్ హీరో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నేచురల్ స్టార్ నాని సమర్పణలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్'. హోలీ సందర్భంగా మార్చి 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Priyadarshi's Court - State vs A Nobody Where To Watch On OTT Platform: నేచురల్ స్టార్ నాని (Nani) వాల్ పోస్టర్ బ్యానర్ సమర్పణలో యంగ్ హీరో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' (Court: The State Versus Nobody). ఈ మూవీతో రామ్ జగదీశ్ దర్శకుడిగా మారగా.. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మూవీలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించగా.. శివాజి, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా హోలీ సందర్భంగా మార్చి 14న థియేటర్లలోకి రిలీజ్ కానుంది. కోర్ట్ రూం బ్యాక్ డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, పవర్ ఫుల్ డ్రామా, మంచి మెసేజ్‌తో 'కోర్ట్' సినిమా రూపొందిందని హీరో నాని తెలిపారు.
'పోక్సో' చట్టం నేపథ్యంలో సెన్సిటివ్ అంశంతో రూపొందిన చిత్రమని తెలుస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లలో టీం హుషారుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో సినిమాపై బజ్ పెంచింది. ఈ మూవీని అందరికీ రీచ్ అయ్యేలా నాని ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సినిమా డిజిటల్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' ఓటీటీ ప్లాట్ ఫాం రూ.9 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత కొద్ది రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
'ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది'
తెలుగు సినిమాకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. ఇలాంటి సమయంలో నాని అన్న అద్భుతమైన కథలతో సినిమాలు తీస్తున్నారని హీరో ప్రియదర్శి అన్నారు. ఆయన నటనతో స్ఫూర్తి పొందానని.. 'వాల్ పోస్టర్' బ్యానర్‌లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కాగా.. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి.. అనంతరం బలగం, డార్లింగ్ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. అనంతరం పలు సినిమాల్లో కమెడియన్‌గానూ అలరించారు.
Also Read: 'ఆయనకు పీపుల్ స్టార్ ట్యాగ్ ఉందని తెలియదు' - ఎవరినీ హర్ట్ చేసే ఉద్దేశం లేదన్న హీరో సందీప్ కిషన్
'థియేటర్లలో చప్పట్లు కొడతారు'
సెన్సిటివ్ అంశంతో బలమైన డ్రామాగా.. గొప్ప సందేశంతో 'కోర్ట్' సినిమా రాబోతోందని హీరో నాని తెలిపారు. 'మూవీ పూర్తయ్యే సరికి థియేటర్లలో ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు కొడతారు. సెన్సిటివ్ అంశం కనుకే దర్శకుడు జగదీశ్ చాలా రీసెర్చ్ చేశారు. 2013లో సాగే కథ ఇది. కేవలం అవగాహన కోసం మాత్రమే తీసిన సినిమాలా ఉండదు. ప్రతి ప్రేమకథలో ఓ సమస్య ఉంటుంది. మా కథలో ఓ కేసు బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలకు నేను పెద్ద ఫ్యాన్. నాకు ప్రియదర్శి చేసిన బలగం సినిమా అంటే ఎంతో ఇష్టం. కోర్ట్ మూవీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా బలగంతో పోటీ పడుతుందని నమ్ముతున్నా. హర్ష, శ్రీదేవి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని నాని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

