ఒక్కో సినిమాకు ఏవరేజ్‌గా 32 కోట్లు - నాని లాస్ట్ 7 ఫిలిమ్స్ థియేట్రికల్ మార్కెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు!

Published by: S Niharika

'సరిపోదా శనివారం' సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 41 కోట్లు అని ట్రేడ్ టాక్.

'హాయ్ నాన్న' ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ కావడంతో జస్ట్ రూ. 27.60 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది.

నాని రీసెంట్ సినిమాల్లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా 'దసరా'. ఆ సినిమాను రూ. 50 కోట్లకు అమ్మారు. 

'అంటే సుందరానికి' క్లాసిక్ ఫిల్మ్ కనుక ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్లకు జరిగింది. 

'శ్యామ్ సింగ రాయ్' హిట్ సినిమా. కానీ, నాని రీసెంట్ సినిమాల్లో లోయస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22 కోట్లు చేసిన సినిమా అదే.

'గ్యాంగ్ లీడర్' థియేట్రికల్ బిజినెస్ రూ. 28 కోట్లు.

'జెర్సీ' ఫీల్ గుడ్ సినిమా అయినా సరే... రూ. 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

'సరిపోదా శనివారం' తర్వాత నాని థియేట్రికల్ మార్కెట్ వేల్యూ పెరిగే అవకాశం ఉంది.