అన్వేషించండి

PS2 Review: పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఎలా ఉంది?

భారీ స్టార్ కాస్టింగ్‌తో రిలీజ్ అయిన మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఎలా ఉంది?

సినిమా రివ్యూ : పొన్నియిన్ సెల్వన్ 2
రేటింగ్ : 2.75/5
నటీనటులు : విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, పార్తీబన్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, లాల్, నాజర్, కిశోర్ తదితరులు 
కథ : కల్కి కృష్ణమూర్తి 'పొన్నియిన్ సెల్వన్' నవల
మాటలు : తనికెళ్ళ భరణి (తెలుగులో)
పాటలు : అనంత శ్రీరామ్ (తెలుగులో)
ఛాయాగ్రహణం : రవి వర్మన్ 
సంగీతం: ఏఆర్ రెహమాన్ 
తెలుగులో విడుదల : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ('దిల్' రాజు)
నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం : మణిరత్నం 
విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2023

Ponniyin Selvan 2 Review: గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళనాట ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ. 500 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష వంటి భారీ స్టార్ట్ కాస్టింగ్‌, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి. ప్రముఖ తమిళ రచయత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి భాగం కేవలం ట్రైలర్ మాత్రమేనని, రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుందని సినిమా ప్రమోషన్‌లో స్టార్లందరూ చెప్పారు. మరి మణిరత్నం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ హిట్ అయిందా?

కథ (Ponniyin Selvan 2 Story): వల్లవరాయ వందియ దేవుడు (కార్తీ), పొన్నియిన్ సెల్వన్ (జయం రవి)... చోళనాడుకు నౌకపై వెళ్తుండగా వారిపై దాడి జరిగి నీటిలో మునిగిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. రెండో భాగాన్ని ఆదిత్య కరికాలుడు (విక్రమ్), నందిని (ఐశ్వర్యా రాయ్) చిన్ననాటి ప్రేమకథ నుంచి మొదలు పెడతారు. ఆ ఫ్లాష్‌బ్యాక్ తర్వాత నీటిలో మునిగిపోయిన వందియ దేవుడు, పొన్నియిన్ సెల్వన్‌లను పూంగుళి (ఐశ్వర్య లక్ష్మి) కాపాడుతుంది. మరోవైపు ఆదిత్య కరికాలుడు, కుందవై (త్రిష), పొన్నియిన్ సెల్వన్‌లను ఒకేసారి చంపడానికి నందిని... పాండ్యులతో కలిసి పథకం వేస్తుంది. మరి నందిని పథకం సఫలం అయిందా? చోళనాడుకు చివరికి ఎవరు రాజు అయ్యారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ‘పొన్నియిన్ సెల్వన్ 1’ తమిళనాట పెద్ద హిట్ అయినప్పటికీ తెలుగులో మాత్రం సో సో గానే ఆడింది. స్క్రీన్ మీద లెక్క పెట్టలేనన్ని పాత్రలు, ఒక్కో పాత్రకు మరిన్ని పేర్లు... ఇవన్నీ కథపైన కాన్సన్‌ట్రేట్ చేయనివ్వలేదు. అయితే మొదటి భాగం తర్వాత దాదాపు ఆరు నెలలు గ్యాప్ రావడంతో ఆడియన్స్‌కు ఈ కథపై ఒక ఐడియా వచ్చింది. రెండో భాగం మొదటి సన్నివేశం నుంచే కథలోకి వెళ్లిపోయారు దర్శకుడు మణిరత్నం.

ఆదిత్య కరికాలుడు, నందినిల చిన్ననాటి ప్రేమ కథ స్క్రీన్‌పై అందంగా కనిపిస్తుంది. పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడని తన కుటుంబం పడే బాధ, ఇదే అదనుగా రాజ్యం కోసం శత్రువులు పన్నే పన్నాగాలు, మరోవైపు శ్రీలంకలో వందియ దేవుడు, పొన్నియిన్ సెల్వన్ తమను తాము కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల మధ్య ఫస్టాఫ్ చాలా రేసీగా సాగుతుంది.

కానీ సెకండాఫ్ కొంచెం సహనానికి పరీక్ష పెడుతుంది. కథలోని కీలక పాత్రల మధ్య డ్రామా పండించడానికి మణిరత్నం ప్రయత్నించినా అది ల్యాగ్ అనిపిస్తుంది తప్ప అంత ఎఫెక్టివ్‌గా కనిపించదు. సెకండాఫ్‌లో విక్రమ్, ఐశ్వర్యా రాయ్‌ల మధ్య వచ్చే సన్నివేశం అద్భుతంగా తెర మీదకు వచ్చింది. అలాగే నందిని పాత్రకు సంబంధించిన ట్విస్టులు బాగా వర్కవుట్ అవుతాయి. చివర్లో వచ్చే యుద్ధ సన్నివేశం ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు అన్నట్లు ఉంటుంది తప్ప కథకు కీలకం ఏమీ కాదు. బాహుబలిలో వార్ సీన్లు చూసిన కళ్లతో ఈ యుద్ధ సన్నివేశాలను అస్సలు చూడలేం.

విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు. దానికి తగ్గట్లు వైడ్ ఫ్రేమ్స్ ఉండే షాట్లు సినిమాలో చాలా తక్కువగా ఉంటాయి. యాక్టర్లకు క్లోజప్ షాట్లు ఎక్కువ పెట్టారు. పాటలు సినిమాకు స్పీడ్ బ్రేకర్లు అవుతాయనుకున్నారేమో బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ మాత్రమే వాడారు. ‘ఆగనందే’ సాంగ్ చిన్న బిట్ మాత్రమే సినిమాలో ఉంటుంది. దానికి సంబంధించిన విజువల్ స్క్రీన్ మీద కూడా అద్భుతంగా వచ్చింది. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. రవివర్మన్ కెమెరా పనితనం అద్భుతం అని చెప్పాలి. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందినట్లు వార్తలు వచ్చాయి. తెర మీద మాత్రం అంత ఖర్చు కనిపించదు.

ఇక నటీనటుల విషయానికి వస్తే... అందరివీ కీలక పాత్రలే కానీ నటనకు స్కోప్ ఉన్నది మాత్రం ఆదిత్య కరికాలుడు, నందిని పాత్రలకే. విక్రమ్, ఐశ్వర్యరాయ్ ఈ పాత్రలకు ప్రాణం పోశారు. పొన్నియిన్ సెల్వన్, వందియ దేవుడు, నందిని పాత్రలు కథలో కీలకమే కానీ ఆ పాత్రలకు ఎమోషన్స్ పండించే సీన్లు పడలేదు. త్రిష, కార్తీల మధ్య వచ్చే లవ్ సీన్‌లో ఇద్దరూ బాగా నటించారు. మిగతా నటీనటులంతా పాత్రల పరిధి మేర నటించారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... మొదటి భాగంతో పోలిస్తే ‘పొన్నియిన్ సెల్వన్ 2’ కచ్చితంగా బెటర్ సినిమానే. కానీ సెకండాఫ్ మీద మరింత కాన్సన్‌ట్రేట్ చేసి ఉంటే మంచి సినిమా అయి ఉండేది. హిస్టారికల్, పీరియాడికల్ మూవీస్‌ను ఇష్టపడేవారు మాత్రం కచ్చితంగా డిజప్పాయింట్ అవ్వరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Embed widget