అన్వేషించండి

Aho Vikramarka Movie Review - అహో విక్రమార్క రివ్యూ: 'మగధీర' విలన్ దేవ్ గిల్ హీరోగా నటించిన సినిమా

Aho Vikramarka Review In Telugu: 'మగధీర'తో విలన్‌గా తెలుగు పాపులరైన ఉత్తరాది నటుడు దేవ్ గిల్. తర్వాత కొన్ని సినిమాలు చేశారు. పాన్ ఇండియా సినిమా 'అహో విక్రమార్క'తో ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.

Dev Gill's debut movie as a hero, Aho Vikramarka review: దేవ్ గిల్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు 'మగధీర' గుర్తొస్తుంది. అందులో విలన్ రోల్ ఆయనకు పేరు తీసుకొచ్చింది. 'మగధీర' తర్వాత తెలుగులో పలు సినిమాలు చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా 'అహో విక్రమార్క'తో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజమౌళి కో డైరెక్టర్, 'దిక్కులు చూడకు రామయ్య' ఫేమ్ త్రికోటి పేట దర్శకత్వం వహించగా... 'కెజిఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. 

కథ (Aho Vikramarka Movie Story): విక్రమార్క (దేవ్ గిల్) సబ్ ఇన్స్పెక్టర్. పుణెలో ఓ స్టేషన్‌లో పోస్టింగ్ వచ్చిన వెంటనే అక్రమార్జనకు తెర తీస్తాడు. డ్రగ్ మాఫియా కీలక సభ్యుడు బిలాల్ (పోసాని కృష్ణమురళి) దగ్గర డబ్బులు తీసుకోవడం మొదలు పెడతాడు. ప్రేమించిన అమ్మాయి అర్చన (చిత్రా శుక్లా) కోసం అక్రమార్కుడు కాస్త నీతి నిజాయితీలకు మారు పేరుగా మారతాడు.

విక్రమార్కలో మార్పు తీసుకొచ్చిన ఘటన ఏమిటి? ఎక్కువ కూలికి ఆశపడి 25 ఏళ్ల క్రితం పనికి వెళ్లిన పార్వతి స్లమ్ ఏరియాలో మనుషులు ఏమయ్యారు? వాళ్లకు, ఈ విక్రమార్కకు సంబంధం ఏమిటి? దట్టమైన అడవుల్లోని దండక ప్రాంతంలో ఏం జరుగుతోంది? అసుర (ప్రవీణ్ టర్డే) ఎవరు? పుణెలో డ్రగ్ మాఫియాను భయంతో పరుగులు పెట్టించిన భవాని (తేజస్వినీ పండిట్) మాయం కావడం వెనుక కారణం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ (Aho Vikramarka Review Telugu): సిల్వర్ స్క్రీన్ మీద తనను తాను హీరోగా చూసుకోవడం కోసం దేవ్ గిల్ తీసుకున్న సినిమా 'అహో విక్రమార్క'. ఇక్కడ 'తీసుకున్న' అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే... నిర్మాతల్లో ఆయనొకరు. కోట్ల రూపాయల డబ్బు, డబ్బు కోసం పని చేసే టెక్నీషియన్లు ఉంటే సినిమా తీయడం సులభం అని చెప్పడానికి 'అహో విక్రమార్క' ఒక ఉదాహరణ.

కథ, కథనం నుంచి మొదలు పెడితే నటీనటుల ప్రతిభ, సంగీతం, దర్శకత్వం వరకు... ఒక్కటంటే ఒక్క అంశంలోనూ ఆకట్టుకొని సినిమా 'అహో విక్రమార్క'. 'కెజిఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించారంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. బహుశా... దేవ్ గిల్ నటన, పేట త్రికోటి దర్శకత్వం, పెన్మత్స ప్రసాద్ వర్మ కథ చూశాక ఏదో ఒకటి కొట్టేద్దాం అని ఆయన కూడా లైట్ తీసుకున్నారేమో!?

పెన్మెత్స ప్రసాద్ వర్మ కథలో ఇసుమంతైనా కొత్తదనం లేదు. పది పదిహేను హిట్ తెలుగు సినిమాలను మిక్సీలో వేసి తీసినట్టు ఉంది. ఎన్టీఆర్ 'టెంపర్', కళ్యాణ్ రామ్ 'పటాస్' సినిమాలు గుర్తు ఉన్నాయా? అవినీతుపరుడైన పోలీస్ మనసును కదిలించే ఘటన తర్వాత నీతిపరుడిగా మారాడతాడు. ఆ రెండూ విజయాలు సాధించాయి. అందుకు కారణం ఆయా కథలను తెరకెక్కించిన తీరు. యాక్షన్, వినోదం, హీరోల నటనతో కొత్తగా ప్రజెంట్ చేసిన విధానం. 'అహో విక్రమార్క' కథను మరొక హీరోతో, దర్శకుడితో తీసి ఉంటే బావుండేదేమో!? యాక్షన్ తప్ప మిగతా సన్నివేశాల్లో మినిమమ్ నటన ఇవ్వలేని దేవ్ గిల్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. కొన్ని సన్నివేశాలు చూస్తే ఎలా తీశారని నవ్వు వస్తుంది.

Also Readఅన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌


దేవ్ గిల్ యాక్షన్ సన్నివేశాలు బాగా చేశారు. ప్రతినాయకుడిగా పలు సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో యాక్షన్ కోసం కష్టపడలేదు. కానీ, లవ్ సీన్స్ వచ్చే సరికి సెట్ కాలేదు. ఆయనలో నటుడు తేలిపోయాడు. బేసిక్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇవ్వలేదు. చిత్రా శుక్లాది రెగ్యులర్ హీరోయిన్ రోల్. కొత్తగా ఏమీ చేయలేదు. పాత్రకు తగ్గట్టు చేశారంతే! విలన్ అసుర రోల్ చేసిన ప్రవీణ్, ఏసీపీ భవానిగా నటించిన తేజస్వినీ పండిట్ సహా కీలక పాత్రల్లో నటించిన కొందరు మరాఠీ నటులు తెలుగు ప్రేక్షకులకు కొత్త. అందువల్ల, వారితో కనెక్ట్ కావడం కష్టం. అయితే... ఉన్నంతలో తేజస్వినీ పండిట్ బెటర్. ఆవిడ నటన బావుంది. 

బిలాల్ పాత్రలో పోసాని కృష్ణమురళి, హీరో తండ్రిగా షాయాజీ షిండే ఓకే. వాళ్లకు అలవాటైన క్యారెక్టర్లు కావడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లారు. కానిస్టేబుల్‌గా బిత్తిరి సత్తి సన్నివేశాల్లో వినోదం రాలేదు. అసుర అనుచరుడిగా తన పాత్రకు న్యాయం చేశారు 'కాలకేయ' ప్రభాకర్.

స్టార్టింగ్ టు ఎండింగ్ ఫక్తు కమర్షియల్ ఫార్మాటులో ఏ దశలోనూ ఆకట్టుకొని నటన, సన్నివేశాలతో తెరకెక్కిన సినిమా 'అహో విక్రమార్క'. కథ, కథనంతో సంబంధం లేకుండా నాలుగు యాక్షన్ సన్నివేశాలు చూడటానికి వెళ్లే ప్రేక్షకులు అయితే హాయిగా వెళ్లొచ్చు. స్క్రీన్ మీద హీరో చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూసి జోక్స్ వేసుకునే స్నేహితుల బృందం వెళ్లొచ్చు. ట్రోలర్స్, మీమ్ పేజీలకు మంచి స్టఫ్ ఇచ్చే సినిమా 'అహో విక్రమార్క'.

Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget