అన్వేషించండి

Telugu Horror Movies: ఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు

Telugu Horror Movies In Aha: సస్పెన్స్ అండ్ థ్రిల్ ఇచ్చే హారర్ సినిమాల కోసం చూస్తున్నారా? అయితే ఆహా ఓటీటీలోకి లాగిన్ అవ్వాల్సిందే. అందులో ఫైవ్ బెస్ట్ తెలుగు హారర్ సినిమాల గురించి తెలుసుకోండి.

హారర్ సినిమాలు భయపెడతాయని తెలుసు. ఊహించని ట్విస్టులు, ఒక్కసారిగా తెరపైకి వచ్చే దెయ్యాలు, ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే నేపథ్య సంగీతం... ఈ హారర్ జానర్ అంటేనే అంత! భయపడుతూ సినిమాలు చూడాలని, అటువంటి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ కోరుకునే ప్రేక్షకులు 'ఆహా' ఓటీటీలో ఈ ఐదు సినిమాలు తప్పకుండా ఒక్కసారైనా చూడాలి.

మాసూద... పక్కా హారర్ సినిమా!
హారర్ అండ్ కామెడీ సినిమాలు ఎక్కువగా వస్తున్న ఈ రోజుల్లో ప్రేక్షకులకు పక్కా హారర్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా, దర్శకుడు సాయి కిరణ్ తీసిన సినిమా 'మసూద'. తిరువీర్, సంగీత, బాంధవి శ్రీధర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

భర్త లేని ఒంటరి మహిళ నీలం (సంగీత). ఆమెకు ఓ కుమార్తె నాజియా (బాంధవి శ్రీధర్). ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని తెలుస్తుంది. అప్పుడు పై అంతస్థులో ఉండే యువకుడు గోపికృష్ణ (తిరువీర్) వాళ్లకు ఎలా సాయం చేశాడు? అనేది స్క్రీన్ మీద చూడాలి. కథలో ముస్లిం నేపథ్యం, దెయ్యాన్ని వదిలించడానికి ఇస్లాంలో చేసే పూజలు, మిగతా అంశాలు ప్రేక్షకులకు ఉత్కంఠతో పాటు భయాన్ని కలిగిస్తాయి.

'మసూద' రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: భయపెట్టడం కోసమే తీసిన సినిమా - భయపెట్టిందా? లేదా?

పిండం... ఆ ఇంటిలో దెయ్యాన్ని చూస్తే భయం! 
తెలుగు ప్రేక్షకులకు శ్రీరామ్ అంటే ఇప్పటికీ 'ఒకరికొకరు' గుర్తుకు వస్తుంది. గుడ్ లుకింగ్ ఇమేజ్ ఉంది. ఆయన ఫీల్ గుడ్ ఫిలిమ్స్ చేస్తారని పేరు ఉంది. కానీ, 'పిండం' సినిమాతో ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు శ్రీరామ్. 

'పిండం' కథకు వస్తే... నిండు గర్భిణీ అయిన భార్య మేరీ (ఖుషి రవి)తో కలిసి ఓ ఊరిలో కొన్న పాత ఇంటికి ఆంటోనీ (శ్రీరామ్) వెళతాడు. ఆల్రెడీ వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు. ఆ ఇంటిలో ఆంటోనీ కుటుంబానికి ఎదురైన ఆపద ఏమిటి? అక్కడ ఎటువంటి చిత్ర విచిత్రమైన ఘటనలు జరిగాయి? ఆ కుటుంబాన్ని అన్నమ్మ (ఈశ్వరీ రావు) ఎలా కాపాడింది? ఆడ పిల్లలను చంపే దెయ్యం ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. 

'పిండం'లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు... చిన్నారులను చంపే సన్నివేశాలు... ఆ నేపథ్య సంగీతం... ఒళ్ళు గగుర్పాటుకు గురి చేయడం ఖాయం. కేవలం హారర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమా తప్పకుండా చూడాలి. 

తంత్ర... ఇదొక రొమాంటిక్ హారర్ మంత్ర!
తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ, 'మర్యాద రామన్న' ఫేమ్ సలోని ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా 'తంత్ర' ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకర్షించిన చిత్రమిది. దీని స్పెషాలిటీ ఏమిటంటే... రక్తం తాగే దెయ్యం కథతో తెరకెక్కడం!

'తంత్ర' కథకు వస్తే... రేఖ (అనన్యా నాగళ్ల)కి దెయ్యాలు దర్శనం ఇస్తాయి. ఆమెపై ఎవరో క్షుద్రపూజలు చేశారని తేజా (ధనుష్ రఘుముద్రి)కు తెలుస్తుంది. పౌర్ణమికి  రక్తదాహంతో తపించే, రక్తాన్ని సేవించే ఓ ఆత్మ రేఖ దగ్గరకు ఎందుకొస్తుంది? ఆ ఊరికి విగతి ('టెంపర్' వంశీ) వచ్చాక రేఖ ఎందుకు కష్టాలు పడుతుంది? రాజేశ్వరి (సలోని) ఎవరు? వజ్రోలి రతి అంటే ఏమిటి? దాన్ని ఎవరు ఎవరి మీద ప్రయోగించారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

అటు హారర్, ఇటు రొమాన్స్... రెండూ బాలన్స్ చేస్తూ తీసిన చిత్రమిది. ముఖ్యంగా వజ్రోలి రతి అంటే ఏమిటనేది ఆసక్తి కలిగిస్తుంది. అలాగే, రక్త పిశాచి ఎవరు? అనే పాయింట్ కూడా! అనన్య, సలోని, టెంపర్ వంశీ నటన ఎంగేజ్ చేస్తుంది.

Also Read: పెళ్లికి ముందూ తర్వాత... సమంత, దీపికను చూశాక ఎవరైనా ఆ మాట అంటారా?


105 మినిట్స్... అనగనగా ఓ అతిథి!
హారర్ సినిమా అంటే ఒక టెంప్లెట్ ఉంటుంది. అందులో సాగుతుంది. ఒకవేళ డిఫరెంట్ హారర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేటట్లు అయితే హన్సిక '105 మినిట్స్' చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింగిల్ క్యారెక్టర్ మీద నడవడం ఈ సినిమా ప్రత్యేకత. జాను (హన్సిక)ను సొంతింట్లో ఇనుప గొలుసులతో ఎవరో బంధిస్తారు? అది ఎవరు? చివరకు ఏమైంది? అనేది కథ. 'మాట రాని మౌనమిది', 'రేయికి వెయ్యు కళ్లు' వంటి  చిన్న తెలుగు సినిమాలు కూడా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అవీ మాంచి హారర్‌ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget