News
News
X

Masooda Review - 'మసూద' రివ్యూ : భయపెట్టడం కోసమే తీసిన సినిమా - భయపెట్టిందా? లేదా?

Masooda Movie Review : హారర్ కంటే హారర్ కామెడీలు ఎక్కువైన ట్రెండ్‌లో కేవలం హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా 'మసూద'. సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ నటించిన సినిమా ఎలా ఉందంటే?   

FOLLOW US: 
 

సినిమా రివ్యూ : మసూద 
రేటింగ్ : 3/5
నటీనటులు : సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు
ఛాయాగ్రహణం : నగేష్ బనెల్
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా
రచన, దర్శకత్వం : సాయికిరణ్ 
విడుదల తేదీ: నవంబర్ 18, 2022

'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన సినిమా 'మసూద' (Masooda Movie). ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు విడుదల చేశారు. ఆయన సినిమా తీసుకోవడం, ప్రచార చిత్రాలు బావుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. హారర్ కంటే హారర్ కామెడీలు ఎక్కువైన ప్రజెంట్ ట్రెండ్‌లో కేవలం హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన చిత్రమిది. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది (Masooda Review)? 

కథ (Masooda Movie Story) : నీలం (సంగీత), ఆమె కుమార్తె నాజియా (బాంధవి శ్రీధర్) ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటారు. వాళ్ళ పై అంతస్థులో గోపికృష్ణ (తిరువీర్) ఉంటాడు. అతడిది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. ఆఫీసులో మినీ (కావ్యా కళ్యాణ్ రామ్) అంటే ఇష్టం. ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఒక రోజు గోపి ఇంటికి మినీ వస్తుంది. ఇద్దరూ దగ్గర అయ్యే సమయానికి ఎవరో తలుపు కొడతారు. తీసి చూస్తే ఎదురుగా నీలం. వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతుంది. ప్రేమించిన అమ్మాయిని వదిలి మరీ వెళతాడు. అక్కడ చూస్తే నజియాకు దెయ్యం పడుతుంది. దెయ్యాన్ని వదిలించడం కోసం గోపి, సంగీత ఏం చేశారు? నాజియాను ఆవహించిన ఆత్మ (ఆమె పేరు 'మసూద') ఎవరు? మసూద ఆత్మగా మారడం వెనుక కారణం ఎవరు?

విశ్లేషణ (Masooda Movie Telugu Review) : హారర్ సినిమాలు అంటే ఎక్కువగా హిందూ సంప్రదాయం నేపథ్యంలో ఉంటాయి. 'మసూద'లో డిఫరెన్స్ ఏంటంటే... కథంతా ముస్లిం నేపథ్యంలో సాగుతుంది. ఆత్మలను వదిలించడానికి సాధువులు, అఘోరాలు పూజలు చేయడం హారర్ సినిమాల్లో చూసుంటాం. 'అరుంధతి'లో షాయాజీ షిండే రోల్ తావీదులు కట్టినా... అందులోనూ హిందూ పూజలు ఎక్కువ. కానీ, 'మసూద' అంతా ముస్లిం నేపథ్యంలో సాగడంతో... పీర్ బాబాలు ఆత్మలను వదిలించడానికి ఇస్లాం నేపథ్యంలో పూజలు చేయడం, మసీదులో మంత్రించిన కత్తితో దెయ్యాన్ని అంతం చేయడానికి చూపించడం వంటివి ఉంటాయి. 

News Reels

'మసూద'లో ముస్లిం నేపథ్యం... సన్నివేశాలను తెరకెక్కించిన తీరు కొంచెం కొత్తగా ఉంటుంది. కథ విషయానికి వస్తే... ఆ కొత్తదనం తక్కువ. కథను నడిపించిన తీరు కూడా సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో దర్శకుడు పాత్రలను పరిచయం చేయడానికి మాత్రమే వాడుకున్నారు. దాంతో కథ ముందుకు కదలదని ఫీలింగ్ ఉంటుంది. నిడివి ఎక్కువైనా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. విశ్రాంతి తర్వాత అసలు కథ మొదలైంది. కథ సాధారణంగా అనిపించినా... సన్నివేశాలు బావున్నాయి. చివరి అరగంట ఉత్కంఠ కలిగిస్తుంది. అందుకు ఛాయాగ్రహణం, సంగీతం ప్రధాన కారణమని చెప్పాలి. ఏదో జరుగబోతుందనే ఉత్కంఠను అలా కొనసాగించారు. 

ప్రశాంత్ ఆర్. విహారి చిన్న సినిమాలతో సంగీత దర్శకుడిగా తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మెలోడీ పాటలకు అభిమానులు ఉన్నారు. 'మసూద'తో హారర్ సినిమాలకు కూడా సంగీతం అందించగలడని పేరొస్తుంది. పలు సన్నివేశాల్లో ఆయన సౌండ్ డిజైనింగ్ బావుంది. భయం కలిగిందంటే ఆయన నేపథ్య సంగీతం కూడా ఓ కారణం. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. కొత్త ఫ్రేమింగ్, లైటింగ్ కనిపించాయి. నగేష్ బనెల్ హారర్ సినిమాకు కావాల్సిన ఫీల్ తీసుకు వచ్చారు. నిర్మాణ విలువలు బావున్నాయి.

నటీనటులు ఎలా చేశారు? : సంగీత సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. గ్లామర్ కాకుండా క్యారెక్టర్‌లో గ్రామర్ చూపించారు. కొన్ని సన్నివేశాల్లో హిజాబ్ ధరించడం, పాత్రకు తగ్గట్టు కాటన్ సారీస్ కట్టుకోవడంతో లుక్ కూడా కొత్తగా అనిపిస్తుంది. తిరువీర్ హీరోలా కాకుండా సగటు యువకుడిలా, పక్కింటి కుర్రాడిలా కనిపిస్తారు. క్యారెక్టర్‌కు తగ్గట్టు నటించారు. బాలనటిగా పలు సినిమాల్లో కనిపించిన కావ్యా కళ్యాణ్ రామ్‌కు కథానాయికగా తొలి చిత్రమిది. అందంగా కనిపించారు. నటన కూడా బావుంది. కమర్షియల్ హీరోయిన్‌కు కావాల్సిన లక్షణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయి. నటిగా డిఫరెంట్ సినిమాలు కూడా చేసే అవకాశం ఉంది. 'శుభలేఖ' సుధాకర్, సత్య ప్రకాష్, 'సత్యం' రాజేష్ తదితరులు పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు. సంగీత కుమార్తె పాత్రలో కనిపించిన బాంధవి శేఖర్ నటన ఆకట్టుకుంటుంది.    

Also Read : 1899 రివ్యూ: DARK దర్శకుడి కొత్త వెబ్ సిరీస్ - సక్సెస్ మళ్లీ రిపీట్ అయిందా?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'మసూద' డీసెంట్ హారర్ ఫిల్మ్. కథ కొత్తది కాదు. కానీ, కథను తెరకెక్కించిన తీరు బావుంది. హారర్ పేరుతో కామెడీ చేయలేదు. కొన్ని సన్నివేశాల్లో నవ్వించారు. సపరేట్ కామెడీ ట్రాక్ రాయకుండా సిట్యువేషనల్ ఫన్ క్రియేట్ చేశారు. హారర్ సీన్స్‌లో కేవలం భయపెట్టాలని మాత్రమే చూశారు. సౌండ్ డిజైనింగ్, ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం, నగేష్ బనెల్ సినిమాటోగ్రఫీతో కొన్ని సన్నివేశాలు భయపెట్టాయి. వాళ్ళిద్దరి వర్క్ వల్ల సాధారణ సన్నివేశాలు కూడా పాస్ అయిపోయాయి. నిడివి కొంచెం ఎక్కువైంది. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బావుండేది. హారర్ అభిమానులను సినిమా ఆకట్టుకుంటుంది.      

Also Read : గాలోడు రివ్యూ: సుడిగాలి సుధీర్ పెద్ద స్క్రీన్‌పై కూడా హిట్ కొట్టాడా?

Published at : 18 Nov 2022 12:59 PM (IST) Tags: ABPDesamReview Masooda Review Masooda Review In Telugu Masooda Telugu Review Masooda Telugu Movie Review  Sangeetha Masooda Review 

సంబంధిత కథనాలు

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Jabardasth Teja - Pavithra: ‘జబర్దస్త్’ తేజాకు, పవిత్రకు పెళ్లి? వైరల్ అవుతోన్న వీడియో

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా - గిప్పడి సంది లెక్కలు టక్కర్

NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా -  గిప్పడి సంది లెక్కలు టక్కర్

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Chandrababu : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇంటికే, నాలుగేళ్ల తర్వాత జగన్ కు బీసీలు గుర్తొచ్చారా? - చంద్రబాబు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa : ఏపీ, తెలంగాణ  కలిస్తే  మోస్ట్  వెల్కం- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు