ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
ఫెంగల్ తుఫాన్ వేళ పెనుగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఈ గాలులు విమానాల ల్యాండింగ్‌కు ప్రమాదకరంగా ఉన్నాయి. విమానాలు ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో చెన్నై విమానాశ్రయంలో భయానక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. తీవ్రమైన గాలుల వాతావరణం కారణంగా ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. సరిగ్గా ఆ విమానం రన్ వేపై ల్యాండ్ అయ్యే క్రమంలో వీచిన గాలులకు ఆ విమానం.. ఊగిపోయింది. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేశాడు. ఈ భయంకర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుపాను కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. చెన్నై విమానాశ్రయంలో కూడా నీరు చేరింది. రన్‌వేలు నీటిలో ఉండటంతో విమానాలు దిగేందుకు, ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వర్షాల ఉద్ధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్నే మూసేయాల్సి వచ్చింది. ఫెయింజల్ తుపాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకిన సందర్భంగా.. తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ. వేగంతో గాలులు వీచినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు.