నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు
ప్రత్యర్థి పార్టీకి చెందిన మాజీ ప్రధానిని ప్రస్తుత ప్రధాన మంత్రి అభినందించడం అనేది చాలా అరుదుగానే జరుగుతుంది. యూపీఏ హాయాంలో ప్రధాన మంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ గురించి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఓ సందర్భంలో అభినందించారు. 2024 ఫిబ్రవరి 8న పార్లమెంట్ రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) బిల్లు, 2023కి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ వీల్ చైర్‌లో పార్లమెంటుకు వచ్చారు. ఆ సంఘటనను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ బిల్లు సభలో నెగ్గుతుందని తెలిసినా.. దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం కోసం మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌లో వచ్చి మరీ ఓటు వేసి.. అందరికీ స్ఫూర్తిగా నిలిచారని మోదీ ప్రశంసించారు.





















