అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీ
వ్యక్తిగత సిద్ధాంతాలను బలవంతంగా రుద్దినట్టుగా అనిపించకూడదు. కానీ..ఆ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా చూపించాలి. ఇది కత్తిమీద సాములాంటి వ్యవహారం. దీన్ని బ్యాలెన్స్ చేయడమే రాజకీయం. పాలిటిక్స్‌లో నిలదొక్కుకోవాలంటే ఈ లౌక్యం తెలిసుండాలి. తమిళనాడులో బీజేపీ కోసం అన్నామలై ఈ లౌక్యాన్నే చూపిస్తున్నారు. తల పండిపోయిన నేత ఏమీ కాదు. కానీ...బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టింది హైకమాండ్. స్వయంగా ప్రధాని మోదీయే స్టేజ్‌పై మెచ్చుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్.. పాలిటిక్స్‌లోకి రావడం గొప్ప విషయం కాకపోవచ్చు. కానీ...వచ్చిన తరవాత నిలదొక్కుకున్న తీరు.. రాజకీయంగా తెచ్చుకున్న పేరు మాత్రం నిజంగా గొప్పే. అన్నామలై ఎంత మొండిఘటమో చెప్పడానికి ఇప్పుడు మనం చూసిన ఈ ఒక్క విజువల్ చాలు. ఎంత మొండిగా నిలబడి కొరడా దెబ్బలు తింటున్నారో చూశారుగా. మామూలుగా అయితే..ఇలాంటివి చూడగానే...ఇంత సీన్ అవసరమా అనిపిస్తుంది. బట్..కాస్త లోతుగా ఆలోచిస్తే..పొలిటికల్ స్ట్రాటెజీ కనిపిస్తుంది. తమిళనాడులో ఉనికి కోసం బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ మిషన్‌కి హైకమాండ్‌కి దొరికిన ఆయుధమే ఈ అన్నామలై. ద్రవిడ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో సనాతనం, హిందుత్వం అనే అజెండాతో వెళ్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. నేషనల్ పార్టీ అయిన బీజేపీ.."లోకల్" అనిపించుకోవాలంటే లోకల్‌గా ఉన్న సమస్యలపైనే కొట్లాడాలి. ఇదే వ్యూహంతో పని చేస్తున్నారు అన్నామలై. ఏ చిన్న తప్పు జరిగినా సరే..ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.