JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Andhra Pradesh News | వైసీపీ హయాంలో తనపై కేసులు పెట్టి వేధించినా లొంగలేదని, అధినేత చంద్రబాబు వెంటే నడిచానని.. తనకు డబ్బులు కాదు, గౌరవం ముఖ్యమన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
Tadipatri Municipal chairman JC Prabhakar Reddy sensational comments | అనంతపురం: డబ్బులు లేక రాజకీయాల్లోకి వచ్చాం అనుకున్నారా, 1951లోనే మమ్మల్ని మద్రాసులో చదివించారు. మేం డబ్బులు లేనోళ్లం. అందుకే ఇప్పుడు సంపాదన మొదలుపెట్టాం’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. గత ఐదేళ్లు నియోజకవర్గ అబివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డాను. గత ఐదేళ్లు చాలా నష్టపోయానన్న ప్రభాకర్ రెడ్డి... దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలపై జేసీ ప్రభాకర్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
మాకు చీము, నెత్తురు ఎక్కువే ఉంది..
జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. మాకు చీము, నెత్తురు ఉంది. ఎవరికీ తలవొంచం. నా లారీల అద్దాలు పగులగొట్టారు. ఆపై 125 బస్సులు పొగోట్టుకున్నాను. పోలీసు ఉన్నతాధికారులకు లేఖలు రాశాం. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఆల్ ఇండియా పర్మిట్ తో దేశ వ్యాప్తంగా అన్ని చోట్లా బస్సులు నడిపాను. డబ్బుల కోసం పార్టీలోకి వచ్చానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం లేనోళ్లం కాదు. డబ్బులతో మమ్మల్ని కొనలేరు. మా వెనుక ప్రజలున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవలేదని ఆవేదన
ఫ్లై యాష్ విషయంలో జరిగిన విషయాలను ఎస్పీ నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నతాధికారులకు లేఖ రాసినా వారు పట్టించుకోలేదు. నా పంతం, పట్టింపులు వల్ల సిమెంట్ పరిశ్రమపై ఆధారపడిన వారు ఇబ్బందులు పడుతున్నారని కుటుంబ సభ్యులు నాతో చెప్పారు. నాపై నమోదైన కేసులు గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30 వేలు మంది ఉన్నారు. ఫ్లై యాష్ అనేది పుట్టగోస లాంటిది. అది మా ప్రెస్టేజ్. మా గురించి వాళ్లకే కాదు, మాకు కూడా చీము నెత్తురు ఎక్కువే ఉంది. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. కానీ ఎవరికీ మేం తలవొంచం.
వైసీపీ హాయంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా ఇంటికి వచ్చిన సమయంలో సరెండర్ అవుతారు. లేక ఊరు విడిచి వెళతారని అనుకున్నారు. కానీ ఆ సమయంలో నియోజకవర్గ ప్రజలు నా వెంటనడిచారు. అందుకు ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉన్నాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
వైసీపీకి తలొగ్గలేదని నాపై కేసులు పెట్టి వేధింపులు...
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో నా భార్య, పిల్లలు అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి నలిగిపోతున్నారు. మా వదిన నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టారు. ఫ్లై యాష్ అంటే అది నాకు కేవలం ప్రెస్టేజ్ మాత్రమే. మాకు సమస్య వచ్చిందని చెబితే ఎవరూ పట్టించుకోలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వానికి లొంగలేదని నన్ను జైల్లో పెట్టారు. మీవి మాత్రమే కుటుంబాలా? మాకు కుటుంబాలు ఉండవా ? వైసీపీకి తలొగ్గలేదని నా బస్సులు సీజ్ చేశారు. పొగరు, ప్రెస్టేజ్ అని వెళ్లకపోతే మాకు ఈ సమస్యలు ఉండేవి కాదు. కానీ ఎంత కష్టం వచ్చినా చంద్రబాబు వెంటే నడిచాను. ఏం జరిగినా ఆయన చూసుకుంటురన్న నమ్మకం’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read: Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్