Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Hyderabad News: కన్నడ బుల్లితెర నటి శోభితా శివన్న హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతేడాది వివాహం చేసుకున్న ఆమె భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

TV Actress Shobhita Forceful Death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కన్నడ బుల్లితెర నటి శోభిత (Shobhitha) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలోని (Sriram Nagar Colony) సీ బ్లాక్‌లో ఉన్న ఆమె ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో వివాహం చేసుకున్న ఆమె భర్త సుధీర్‌తో కలిపి హైదరాబాద్ శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నటి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె స్వస్థలం కర్ణాటకలోని సక్లేశ్‌పూర్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

