అన్వేషించండి

Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల

Telangana News: ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల కమిటీ స్పందించింది. మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు అనుమానాలున్నాయని ఓ లేఖ విడుదల చేసింది.

Telangana State Committee Of The Civil Rights Association On Mulugu Encounter: ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం (Eturunagaram) చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌పై (Encounter) పౌర హక్కుల కమిటీ స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలున్నాయని.. మృతి చెందిన మావోయిస్టులకు అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజల ద్వారా తెలుస్తుందని పేర్కొంది. మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్ష నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో 16 మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హతమార్చిందని హక్కుల సంఘం ఆరోపించింది.
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల

'ఎన్‌కౌంటర్ల తెలంగాణగా మార్చింది'

కాంగ్రెస్ మళ్లీ ఎన్‌కౌంటర్ల తెలంగాణగా మార్చేసిందని లేఖలో పౌర హక్కుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కగార్‌ను రాష్ట్రంలో అమలుపరిచే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతుందని హక్కుల కమిటీ లేఖలో పేర్కొంది. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బందాలను అమలు పరుస్తూ ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టులను కాల్చి చంపడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ పాలనలో బూటకపు ఎన్‌కౌంటర్లు

అటు, ఈ ఎన్‌కౌంటర్‌పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాంగ్రెస్ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని విమర్శించారు. అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు అశాంతిని రేపుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలు నిర్వహిస్తుంటే ఈ పద్ధతి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించి 6 గ్యారెంటీలను అటకెక్కించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అంటూ డబ్బా కొట్టి.. దానికీ తూట్లు పొడిచారని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

కాగా, ములుగు జిల్లా ఏటూరునాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతడి దళ సభ్యులు మృతి చెందినట్లు సమాచారం. అలాగే, ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Maoists Encounter: అడవిలో అన్నలకు ఎదురు దెబ్బలు, ఎన్‌కౌంటర్లలో 200కు పైగా మావోయిస్టుల మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Varun Tej: కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
కొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
Embed widget