అన్వేషించండి

Maoists Encounter: అడవిలో అన్నలకు ఎదురు దెబ్బలు, ఎన్‌కౌంటర్లలో 200కు పైగా మావోయిస్టుల మృతి

Encounter In Telangana | ములుగు జిల్లా ఏజెన్సీలోని చల్పాక గోదావరి పరివాహక ప్రాంతంలో గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.

Encounter In Mulugu District Telangana | వరంగల్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తాకింది. ములుగు జిల్లా ఏజెన్సీలోని చల్పాక గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయిన వారిలో ఇద్దరు అగ్ర నేతలతో పాటు మరో ఐదుగురు ఏరియా కమిటీ, పార్టీ సభ్యులు ఉన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరగడంతో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహాత్మకంగా చుట్టు ముట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఇరువైపుల నుండి ఎదురుకాల్పులు జరిగినా మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ జరిగింది.

200 దాటిన మావోయిస్టుల మృతుల సంఖ్య

అడవిలో కాల్పుల మోత కొనసాగుతుంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. పోలీసుల వ్యూహాలను ఎత్తుగడలను మావోయిస్టులు చేదించలేకపోవడంతో మావోయిస్టు పార్టీకి ప్రాణ నష్టం తప్పడం లేదు. 2024 జనవరి నుండి డిసెంబర్ ఒకటో తేదీ వరకు గడిచిన 11 నెలల్లో మహారాష్ట్ర, చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు దాదాపు 215 మంది మావోయిస్టులు మృతి చెందారు. 11 నెలలుగా ఎన్ కౌంటర్ ల అనంతరం పోలీసులు వెల్లడించిన లెక్కల ప్రకారం అంతమంది అన్నలు నేలకొరిగారు.


మావోయిస్టుల లెక్కలు వేరు..

ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేతలో భాగంగా జరిగిన ఎన్కౌంటర్ లలో 215 మంది మావోయిస్టులు మృతి చెందగా, మావోయిస్టు పార్టీ ఎన్ కౌంటర్ లను ఖండిస్తూ. ఎన్ కౌంటర్లలో మావోయిస్టుల తో పాటు అమాయక గిరిజనులను చంపి మిల్టెంట్లుగా చిత్రికరిస్తున్నారని మావోయిస్టు పార్టీ అనేక సందర్భాల్లో వెల్లడించడం జరిగింది.


డిసెంబర్ 2 నుండి పి ఎల్ జి ఏ వారోత్సవాలు.

పి ఎల్ జి ఏ (ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలకు ఒక్కరోజు ముందే ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం జరిగింది. పి ఎల్ జి ఏ ఏర్పడి 24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు పిలుపునిచ్చింది. ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు సైతం వెలిశాయి. వారోత్సవాలకు సన్నద్ధమవుతున్న క్రమంలో తెలంగాణ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరగడం సంచలనం రేపింది. పక్క సమాచారంతో పోలీసులు మావోయిస్టులను టార్గెట్ చేసి ఉంటారనే చర్చ జరుగుతుంది. దండకారణ్యంలో తీవ్ర నిర్భంధం, పోలీస్ బలగాల వ్యూహాల నుండి తప్పించుకోవడానికి సేఫ్ జోన్ లేదా ఛత్తీస్గఢ్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే  క్రమంలో పోలీస్ లకు సమాచారం అందడం వారి కదలికలను గుర్తించడంతో ఎదురుకాల్పులు చోటు చేసుకొని మావోయిస్టు మృతి చెందడం జరుగుతుంది.  

Also Read: Mulugu Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టుల హతం

తీవ్ర నిర్బంధంలో మావోయిస్టుల సంచలనాలు

పోలీస్ బలగాల వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో కూడా మావోయిస్టులు ఉనికిని చాటుకుంటున్నారు.10 రోజుల క్రితం ములుగు ఏజెన్సీ లోని వాజేడు మండలం పెనుగోలు కాలనీ లో పోలీస్ ల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టుల హత్య చేసి సంచలనం రేపారు. వారోత్సవాల సందర్భంగా బ్యానర్లు కట్టడం, వాల్ పోస్టర్లు వేయడం జరుగుతుంది.

Also Read : Maoist Encounter: ఇరవై ఏళ్లలో ఎంత మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ అయ్యారో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget