Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు
ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. మెగావేలంలో పోటీపడి మరి కుర్రోళ్లను దక్కించుకునేందుకు ఐపీఎల్ జట్లు ఉత్సాహం చూపించాయి. అలాగే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కి కొత్త అస్త్రంగా కాకినాడ కుర్రోడు కనిపించాడు. అతనే సత్యనారాయణరాజు. మెగావేలంలో 30లక్షల రూపాయలకు రాజును కొనుక్కుంది ముంబై ఇండియన్స్. సత్యనారాయణరాజు ఎంపికతో కాకినాడ క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రత్యేకించి సత్యనారాయణరాజు తల్లితండ్రులు పెన్మత్స రమేష్ రాజు, రాఖీ దంపతుల ఆనందానికైతే అవధులు లేవు. టీమిండియాకు ఆడాలనేది తమ కుమారుడి కల అని ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి ఛాన్స్ రావటంతో ఆ కల దిశగా సత్యనారాయణరాజు తనను తను ప్రూవ్ చేసుకుంటాడని సంతోషంగా చెబుతున్నారు. అసలు రాజు ఈ స్థాయిలో అందరినీ దృష్టినీ ఆకర్షించటానికి కారణం ఏంటీ...అతనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టం వాళ్ల అమ్మానాన్న మాటల్లోనే విందాం. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ లతో కలిసి ఆడే అవకాశాన్ని తమ కుమారుడు దక్కించుకోవటంపై ఎంత సంతోషంగా ఉన్నారో ఈ ఇంటర్వ్యూ లో చూసేయండి.