Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
Chicken Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గగా.. కోడిగుడ్ల ధరలు మాత్రం పెరిగాయి. ప్రస్తుతం ఏపీ, తెెలంగాణల్లో డజన్ గుడ్ల ధర రూ.80 - రూ.84గా ఉంది.
Egg Rates Increasing In AP And Telangana: కార్తీక మాసం సందర్భంగా ప్రజలు మాంసాహారం తినడం తగ్గించేయడంతో గత నెల రోజులుగా చికెన్ (Chickens) ధరలు తగ్గాయి. తాజాగా, చికెన్ ధర మరింత తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో (Hyderabad) కేజీ చికెన్ ధర రూ.180 నుంచి రూ.220 వరకూ ఉంది. ఒకప్పుడు ఇది రూ.300 నుంచి రూ.350 వరకూ వెళ్లింది. అయితే, వచ్చేది క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్ కనుక చికెన్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపారులు అంటున్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల (Eggs) ధరలు మాత్రం భారీగా పెరిగాయి. NECC హోల్ సేల్ కోడిగుడ్ల ధర రూ.5.90 గా నిర్ణయించగా.. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6.50 నుంచి రూ.7 వరకూ పలుకుతోంది. ప్రస్తుతం డజన్ కోడిగుడ్ల ధర రూ.80గా ఉంది. చికెన్ ధరలు తగ్గాయని ఆనందించే లోపే గుడ్ల ధరలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఏపీ, తెలంగాణల్లో డజన్ కోడిగుడ్ల ధర రూ.80 - రూ.84గా పలుకుతోంది. రానున్న రోజుల్లో కోడిగుడ్ల ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. చలికాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంటుందని.. కోళ్ల దాణా రేట్లు, రవాణా ఖర్చులు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు.