అన్వేషించండి

SJ Suryah: అన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

SJ Suryah Movies Latest List: దర్శకుడిగా ఎస్.జె. సూర్య కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. నటుడిగా మారిన తర్వాత ముఖ్యంగా విలన్‌గా ఆయన ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. అందులో టాప్ 5 సినిమాలు...

'ఖుషి'... టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్. ఇండస్ట్రీ హిట్. ఎస్.జె. సూర్య పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు అందరికీ పవన్ కళ్యాణ్ సినిమాయే గుర్తుకు వస్తుంది. 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ వేడుకలో ''ఖుషి 2' తీస్తే పవన్ కల్యాణ్ గారితో తీయండి'' అని హీరోయిన్ ప్రియాంక మోహన్ రిక్వెస్ట్ చేశారంటే... దర్శకుడిగా ఎస్.జె. సూర్య ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఇప్పుడు ఆయన నటుడిగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సారీ... సారీ... విలనిజంతో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తున్నారు.

ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ చూసిన అత్యుత్తమ నటుల్లో, ప్రతినాయకులలో ఎస్.జె. సూర్య ఒకరు అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ ఫిల్మ్ 'సరిపోదా శనివారం'లోనూ ఆయన విలన్ రోల్ చేశారు. అసలు ఎస్.జె. సూర్య నటించిన ఐకానిక్, ట్రెండ్ సెట్ విలన్ రోల్స్ ఒక్కసారి చూడండి.

స్పైడర్... సూర్య విలనిజం ఎవర్‌గ్రీన్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చేసిన 'స్పైడర్' ఆశించిన విజయం సాధించలేదు. ఆ సినిమా కమర్షియల్ ఫ్లాప్. కానీ, అందులో ఎస్.జె. సూర్య నటనకు, విలనిజానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 

'స్పైడర్'లో విలన్ క్యారెక్టర్ పాపులర్ కావడానికి కారణం కథ, క్యారెక్టర్ కాదు... కేవలం సూర్య ఎక్స్‌ప్రెషన్స్‌ మాత్రమే. ముఖ్యంగా ప్రజల ఆర్తనాదాలు చేసే సమయంలో ఆయన హావభావాలు ఐకానిక్. సినిమా ఫ్లాప్ అయినా సరే ఎస్.జె. సూర్య రూపంలో గొప్ప నటుడిని దక్షిణాది సినిమా పరిశ్రమకు అందించింది 'స్పైడర్'. శవం దగ్గర మనుషుల ఏడుపు విని ఎంజాయ్ చేసే క్యారెక్టర్ క్రియేటర్ మురుగదాస్ అయినా సరే... ఆ పాత్రకు క్లాసిక్, ఐకానిక్ పేరు వచ్చేలా చేసింది ఎస్.జె. సూర్య నటన.

డ్యూయల్ రోల్... విలనిజం ప్లస్ ఫన్!
సిల్క్ స్మిత... ఈ పేరుకు ఓ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆమె అంటే ప్రేక్షకులు పడి చచ్చేవారు. సిల్క్... ఆ పేరులో వైబ్రేషన్ ఉంది. ఆమె గురించి తెలియని ఈతరం ప్రేక్షకులు ఎవరైనా 'మార్క్ ఆంటోనీ' చూస్తే... అందులో ఎస్.జె. సూర్య నటన చూస్తే... సిల్క్ స్మిత వీరాభిమానులు ఎలా ఉండేవారో తెలుస్తుంది. బాగా నవ్వు వస్తుంది.

'మార్క్ ఆంటోనీ'లో ఎస్.జె. సూర్య డ్యూయల్ రోల్ చేశారు. టైమ్ ట్రావెల్ మూవీలో తండ్రి కొడుకులుగా కనిపించారు. సిల్క్ స్మిత అంటే పడి చచ్చే తండ్రి మదన్ పాండియన్ పాత్రలో ఆయన పండించిన వినోదం అంతా ఇంతా కాదు. సిల్క్ పేరు సూర్య నోటి వెంట వచ్చిన ప్రతిసారీ థియేటర్లలో ప్రేక్షకులు నవ్వారు. జాకీ పాత్రలో విలనిజం పండించారు.   

అదిరింది... ఎస్.జె. సూర్య నటన కూడా!
తమిళ హీరో, దళపతి విజయ్ సినిమాలో విలన్ ఉన్నా... హీరోపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆయన హీరోయిజం ఎలివేట్ అవుతూ ఉంటుంది. పైగా ముగ్గురు హీరోలు ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 'మెర్సల్' (తెలుగులో 'అదిరింది')లో విజయ్ ట్రిపుల్ రోల్ చేశారు. అయితే, అందులో కరప్ట్ డాక్టర్ డేనియల్ పాత్రలో సెటిల్డ్ విలనిజం చూపించారు. అందుకే, ఆయనకు సైమా బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్ అవార్డు వచ్చింది.

మానాడు... మళ్లీ మళ్లీ... డిఫరెంట్‌గా ఉంటుంది చూడు!
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్.. టైమ్ ట్రావెల్ ఫిల్మ్... ఈ జానర్స్ చేయడం కష్టం. ఈ తరహా సినిమాల్లో ఒక్కోసారి నటీనటుల కంటే స్క్రీన్ ప్లే మేజిక్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. కానీ, వెంకట్ ప్రభు తీసిన 'మానాడు'లో హీరో శింబు, విలన్ ఎస్.జె. సూర్య నటన ఒక్కోసారి సినిమాను డామినేట్ చేస్తుంది.

ముఖ్యమంత్రిని చంపమని హీరో శింబును డీసీపీగా చేసిన బెదిరించే సన్నివేశం గానీ, హీరోని చంపే సన్నివేశంలో గానీ ఎస్.జె. సూర్య నటన అద్భుతం. 'స్పైడర్', 'మెర్సల్' తర్వాత 'మానాడు' విడుదలైంది. ఆ రెండు సినిమాలతో పోలిస్తే ఇందులో ఎస్.జె. సూర్య నటన కొత్తగా ఉంటుంది. ఈ మధ్య విడుదలైన సినిమాలతో కంపేర్ చేసినా, రాబోయే సినిమాలతో పోల్చి చూసినా... 'మానాడు'లో ఎస్.జె. సూర్య నటనను మళ్లీ ఆయన మ్యాచ్ చేయడం కష్టం.  

రాయన్... ఎస్.జె. సూర్యను ఎలా మరువగలమ్!
'రాయన్' విడుదలైన తర్వాత ధనుష్ దర్శకత్వం గురించి, ఆ కథను ఆయన తీసిన విధానం గురించి ఎక్కువ మంది మాట్లాడారు. అన్నదమ్ముల మీద ఓ అన్నయ్య,  ఓ చెల్లెలు కలిసి ఎలా ప్రతీకారం తీర్చుకున్న తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సన్నివేశాలు అంత బలంగా రావడానికి కారణం ఎస్.జె. సూర్య విలనిజం!

'రాయన్'లో ఎస్.జె. సూర్య పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయి. తండ్రిని చంపిన వ్యక్తి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అతడిని రాయన్ (ధనుష్) చంపడంతో అతడిని తన బృందంలో చేర్చుకోవాలని అనుకుంటాడు. అది కుదరదు. దాంతో అతడిని చంపడానికి సొంత తమ్ముళ్లను పంపిస్తాడు. కపట నాటకం ఆడతాడు. రెండో భార్యను కిడ్నాప్ చేస్తే విలవిల్లాడతాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు పాత్రతో పాటు ఎస్.జె. సూర్య నటన సైతం మారుతూ కథలో ఆసక్తి కలిగిస్తూ ముందుకు వెళుతుంది.

దర్శకుడిగా అజిత్ 'వాలి'లో సరికొత్త విలనిజాన్ని వెండితెరపై ఆవిష్కరించారు సూర్య. 'ఖుషి'లో అసలు విలనే లేకుండా విలనిజాన్ని చూపించారు, ఆ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఈగోనే కథలో మెయిన్ విలన్.

Also Read: ఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు


SJ Suryah Upcoming Movies: ఆగస్టు 29, 2024న 'సరిపోదా శనివారం' విడుదల కానుంది. అందులో ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లోనూ ఆయనది నెగిటివ్ షేడ్ ఉన్న రోల్. శంకర్ దర్శకత్వం వహించిన 'భారతీయుడు 2'లోనూ విలన్ అయినప్పటికీ... ఆయన స్క్రీన్ స్పేస్ తక్కువ. ఆ సినిమా కూడా హిట్ కాలేదు. అయితే... 'భారతీయుడు 3'లో ఆయన ఇంకాస్త ఎక్కువ సేపు కనిపించనున్నారు. కార్తీ 'సర్దార్ 2'లో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో సూర్య నటిస్తున్నారని సమాచారం. చియాన్ విక్రమ్ 'వీర ధీర శూర', 'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు.

Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget