Kanguva: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే
Kanguva Action Sequence: 'కంగువ' ట్రైలర్ విడుదలైన తర్వాత విజువల్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. దసరాకు సినిమా విడుదలైతే యాక్షన్ సీక్వెన్సుల గురించి మాత్రమే మాట్లాడతారని చెప్పాలి.
How Many Action Episodes In Kanguva Movie: స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా 'కంగువ'. ఇదొక పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్. ట్రైలర్ విడుదల తర్వాత విజువల్స్ గురించి ఆడియన్స్ మాట్లాడారు. ఇంకా మాట్లాడుతున్నారు. భారతీయ వెండితెరపై ఇప్పటి వరకు ఈ తరహా రా ఫిల్మ్ రాలేదని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే... సినిమా విడుదల తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ / సీక్వెన్సుల గురించి ప్రత్యేకంగా మాట్లాడతారని చెప్పాలి. 'కంగువ' నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా మీడియాకు ప్రత్యేకంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చూపించారు. శాంపిల్ అన్నట్టు ట్రైలర్‌లో చిన్న చిన్న గ్లింప్స్ వదిలారు. మేజర్ యాక్షన్ గురించి చెప్పాలంటే...
కంగువ చేతికి ఏనుగు దంతాలు!
Suriya In Kanguva: 'అరవింద సమేత వీర రాఘవ'లో శత్రు సంహారం తర్వాత ఇంటికి వచ్చిన మనవడు (ఎన్టీఆర్)తో 'ఆ పొద్దు వాడి చేతికి కత్తి మొలిచినట్టు ఉందని జనాలు అన్నారు' అని చెబుతుంది నాయనమ్మ. 'కంగువ'లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చూస్తే... సూర్య చేతికి ఏనుగు దంతాలు మొలిచినట్టు అనిపిస్తాయి. కత్తులతో యుద్ధం కామన్. కానీ, ఆ ఎంటైర్ యాక్షన్ ఎపిసోడ్ అంతా ఏనుగు దంతాలతో చాలా కొత్తగా ఉంటుంది.
బాణంతో దూసుకు వచ్చిన పాము!
పీరియాడిక్ సినిమాలు అంటే విల్లుతో యుద్ధాలు కామన్! కానీ, 'కంగువ' యాక్షన్ మాస్టర్లు, దర్శక రచయితలు కొత్తగా ఆలోచించారు. దూసుకు వచ్చే బాణం, అంతే వేగంగా కాటు వేసే సర్పం... రెండూ విడదీయరాని ప్యాకేజీలా వస్తే? పాము కాటుకు అయినా చావాలి. లేదంటే బాణం గుచ్చుకుని అయినా చావాలి. ట్రైలర్‌లో ఈ షాట్ చాలా మందిని ఆకర్షించింది. జస్ట్ ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. సినిమాలో ఈ టోటల్ ఎపిసోడ్ జస్ట్ వావ్ అనేలా ఉంటుంది.
నీటి మడుగులో... ముసలితో పోరాటం!
Crocodile fight in Kanguva: 'కంగువ' టీజర్ విడుదలైనప్పుడు ఆ వీడియో మధ్యలో నీటిలో నుంచి పైకి వచ్చిన ముసలి కనురెప్ప తెరుస్తుంది. ఆ విజువల్స్ అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ చూస్తే... ఆ ముసలిని సూర్య చంపే సన్నివేశం ఉంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమాలో ఫుల్ ఎపిసోడ్ అదిరిపోద్ది. ఆల్మోస్ట్ ఐదు నుంచి పది నిమిషాల పాటు ఆ సీక్వెన్స్ ఉంటుంది.
గొంతులో కత్తి దిగితే... గుండెల్లో దడదడ!
పీరియాడిక్ సినిమాల్లో కనిపించే మరో కామన్ ఆయుధం కత్తి! 'కంగువ'లోనూ కత్తి యుద్ధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు చూసిన కత్తి యుద్ధాలకు భిన్నంగా ఆ కత్తి యుద్ధం ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అందులో హీరోయిజం బావుంటుందని, కంగువ కత్తి దింపే తెగువకు శత్రువుల గుండెలు అదురుతాయని, ప్రాణ భయంతో పరుగులు తీస్తారని సమాచారం.
చీకటిని చీలుస్తూ వచ్చే అగ్ని గోళాలు!
చిమ్మ చీకటి, అందరూ నిద్రలో ఉన్నారని భావించిన శత్రువులు కంగువ తెగపై దాడికి ప్రయత్నిస్తారు. అప్పుడు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు సూర్య. ఒక్కసారిగా చీకటిని చీలుస్తూ అగ్ని గోళాలు రావడం... మండే సూర్యుడిని తలపిస్తాయని టాక్. 'కంగువ'లో ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ సర్‌ప్రైజ్ చేస్తుందని తెలిసింది.
చుట్టుముడితే... కంగువ బలం చెప్పేలా!
కథతో పాటు 'కంగువ' సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, హీరోయిజం కోసం డిజైన్ చేసినట్టు కాకుండా... సన్నివేశాలతో పాటు అలా వెళతాయని తెలిసింది. ఈ సినిమా అంతా మధ్య మధ్యలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. వాటిలో కంగువ బలం చెప్పేవి సైతం ఉన్నాయి. అందులో ఒకటి... భారీ చెట్టును నడుము మీద పెట్టుకుని, రెండు చేతులతో పట్టుకుని సూర్య చేసే యాక్షన్ ఎపిసోడ్!
దసరా సందర్భంగా అక్టోబర్ 10న 'కంగువ' థియేటర్లలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే కాదు... పదికి పైగా భాషల్లో సినిమా విడుదల కానుంది. అంతర్జాతీయ భాషల్లో అనువదించే పనుల్లో చిత్ర బృందం నిమగ్నమైంది. శివ దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది. ట్రైలర్ తర్వాత అంచనాలు పెరిగాయి. రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.