Long Covid: లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి
లాంగ్ కోవిడ్ బారిన పడి ప్రపంచంలో ఎంతో మంది బాధపడుతున్నారు.
కోవిడ్ తగ్గినా కూడా లాంగ్ కోవిడ్ ఎంతో మందిని వేధిస్తోంది. లక్షల మంది గత రెండు మూడేళ్లుగా లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు. పన్నెండు వారాలకు మించి కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నట్టే. లాంగ్ కోవిడ్ ఉన్న వారిలో అలసట, కళ్లు ఎర్రగా ఉండడం, తలనొప్పి, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాల కోవిడ్‌ను నివారించడానికి ప్రస్తుతం సరైన చికిత్స లేదు, కానీ లక్షణాలను తగ్గించే మార్గాలు మాత్రం ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆహార మార్పు. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల లక్షణాలను తగ్గించవచ్చు.
హిస్టామిన్ ఉన్న ఆహారాలు
హిస్టామిన్ ఉన్న ఆహారాలు తినడం వల్ల పరిస్థితి దిగజారుతుంది. హిస్టామిన్ అంటే అలెర్జీలను పెంచే రసాయనం. ఇది మన శరీరం నుంచి విడుదలవుతుంది. తుమ్ములు, దురదలు వచ్చేలా మనల్ని ప్రేరేపిస్తుంది. యాంటీ హిస్టమైన్స్ మందులు ఉన్నాయి. చాలా మందికి వైద్యులు వాటిని సూచిస్తున్నారు. ఇలా మందులు వేసుకోవడంతో పాటూ అధిక హిస్టమిన్ కలిగవిన ఆహారాలను దూరం పెట్టడం వల్ల కూడా లక్షణాల వల్ల బయటపడవచ్చు.
ఇవి తినవద్దు
పెరుగు
బీరు
వైన్
ప్రాసెస్ చేసిన మాంసాహారం
పులియబెట్టిన ఆహారాలు
చీజ్
కాల్చని చేపలు
రెడీ-టు-ఈట్ భోజనం
టిన్డ్ ఫుడ్స్
హిస్టామిన్ అనేది మన రోగనిరోధక ప్రతిస్పందనను నియంత్రిస్తుంది. అలెర్జీ కారకాలు, సైటోకిన్లు, ఒత్తిడి హార్మోన్లు ఎదుర్కొన్నప్పుడు ఇది ఎక్కువ విడుదల అవుతుంది. హిస్టామిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల అతిసారం, శ్వాసఆడకపోవడం, తలనొప్పి, చికాకు వంటివి కలుగుతాయి.
ఏం తినాలి?
శరీరానికి పోషకాహారాన్ని అందించడం ముఖ్యం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తాజాగా, ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మిగిలిపోయిన అన్నం, కూరలు వంటివి తినడం మానేయాలి. నారింజ, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, మిరియాలు, బంగాళాదుంపలు వంటి వాటిలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. అలాగే ఎరుపు ఆపిల్, ద్రాక్ష, ఉల్లిపాయలు, బెర్రీ పండ్లను కూడా తింటే క్వెర్సెటివ్ అందుతుంది. అలాగే ఆహారంలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. రోజూ తాజా ఆహారాన్నే తింటూ ఉండాలి. వ్యాయామం రోజూ కనీసం అరగంటైనా చేయాలి.
Also read: ఈజిప్టు సమాధుల్లో వెల్లుల్లి రెబ్బలు, ప్రాచీన వైద్యంలో వీటిదే ప్రథమ స్థానం
Also read: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.