Hypotension: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి
లో బీపీ వల్ల కొందరికి కళ్లు తిరుగుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి.
హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు, హైపో టెన్షన్ అంటే తక్కువ రక్తపోటు. మీ రక్తపోటు 90/60 కన్నా తక్కువ ఉంటే దాన్ని హైపో టెన్షన్ అంటారు. ఇది చాలా మందిని వేధిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో కనిపిస్తుంది. రక్తపోటు తక్కువగా ఉంది అనగానే చాలా మంది చేసే పని ఉప్పు వేసుకుని ఆహారాన్ని తినడం. కానీ శరీరంలో సోడియం తగ్గడం వల్లే లోబీపీ వస్తుందనుకోవడం పొరపాటు. ఇతర కారణాల వల్ల కూడా రక్తపోటు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
తక్కువ రక్తపోటు అనేది అనేక రకాలుగా ఉంటుంది. తిన్న వెంటనే రక్తపోటు తగ్గితే ఒకరకం, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు రక్తపోటు తగ్గితే మరో రకం, నిల్చున్పప్పుడు రక్తపోటు తగ్గితే అది మరో రకం. మీకు ఎప్పుడు రక్తపోటు తగ్గుతుందో ముందు తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ అల్ప రక్తపోటు అయినా సాధారణ స్థాయికి వచ్చేస్తుంది.
తక్కువ రక్తపోటుకు కారణాలు...
1. శరీరంలో రక్తప్రసరణను బలహీనపరిచేలా చేసే గుండె సంబంధ పరిస్థితులు.
2. గర్భం ధరించడం
3. డీ హైడ్రేషన్ లేదా డయేరియా
4. శరీరంలో ముఖ్యమైన అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందని పరిస్థితి.
5. ఎక్కువ కాలం బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు
రక్తపోటు స్థాయి ఎలా పెంచాలి?
మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. నీటిని పుష్కలంగా తాగాలి. శరీరంలో నీరు తగ్గినప్పుడు కూడా రక్తపోటు పడిపోతుంది. వేడి వాతావరణంలో తగినంత నీళ్లు తాగాలని గుర్తుపెట్టుకోండి. డీ హైడ్రేషన్ అనేది అల్ప రక్తపోటుకు కారణం అవుతుందని ప్రజలకు అవగాహన లేదు. అలాగే ఎక్కువ కాలం ఆకలితో ఉండడం వల్ల కూడా బీపీ తగ్గుతుంది. ఎక్కువ కాలం ఖాళీ పొట్టతో ఉండకుండా చూసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రక్తపోటు సాధారణ స్థితికి రాకపోతే వైద్యుడిని కలిసి మందులు వాడడం ఉత్తమం.
తినాల్సిన పదార్థాలు
1. బ్రకోలీ
2. గుడ్లు
3. చికెన్
4. చేపలు
5. కాఫీ
6. కిస్‌మిస్
7. చికెన్ లివర్
Also read: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే
Also read: ఉదయం నిద్ర నుంచి లేచాక కూడా అలసటగా అనిపిస్తోందా? అయితే ఇవే కారణాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.