Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్
భూగర్భజలాలు చాలా ఆరోగ్యకరమైనవని భావించే వారికి ఇది షాకింగ్ న్యూస్.
నీరే ప్రాణాధారం. మంచి నీరు తాగితేనే శరీరం ఆరోగ్యంగా ఉండేది. కానీ మనకు తెలియకుండానే ప్రమాదకరమైన లోహాలు తాగే అవకాశం ఉంది. దానికి ఈ ప్రభుత్వ డేటానే సాక్ష్యం. భూగర్భ జలాల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన విషపూరిత లోహాలు ఉన్నాయని ఓ డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో భూగర్భ జలాలపై అధ్యయనం నిర్వహించింది. అ రిపోర్టులో ఈ షాకింగ్ విషయం తెలిసింది. జలశక్తి మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దాదాపు అన్ని రాష్ట్రాల్లోని భూగర్భజలాల్లోని నీరు విషపూరితంగా మారింది. ముఖ్యంగా గ్రామాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది.
అధ్యయనంలో ఏం తేలింది?
దేశంలోని 209 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన ఆర్సెనిక్ బయటపడింది. అలాగే 152 జిల్లాల్లో నీటిలో యురేనియం లోహం ఉన్నట్టు గుర్తించారు. ఈ రెండూ కూడా మానవ శరీరానికి తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. లీటరు నీటిలో 0.03 మిల్లీగ్రాముల యురేనియాన్ని గుర్తించారు. అలాగే ఆర్సెనిక్ లీటరు నీటిలో 0.01 మిల్లీ గ్రాములు ఉన్నట్టు తేలింది. అలాగే కాడ్మియం లోపం కూడడా 0.003 మిల్లీగ్రాములు లీటరు నీటిలో ఉన్నట్టు గుర్తించారు. దీర్ఘకాలంలో ఇవే నీటిని తాగుతుండడం వల్ల కొన్నేళ్లు ఇవి శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉంది.
దేశంలో 80 శాతానికి పైగా జనాభా భూగర్భజలాలనే తాగుతోంది. అందులో ఫ్లోరైడ్, ఆర్సెనిక్, ఇనుముతో కలుషితమైన నీటినే సేవిస్తోంది. భారీగా లవణం, నైట్రైట్లు, భారీ లోహాలు ఆ నీటిలో కలిసి ఉంటున్నాయి.
ఈ సమస్యలు తప్పవు
ఇలా భారీలోహాలు కలిసిన నీటిని ఎక్కువ కాలం పాటూ తాగడం వల్ల కొన్నాళ్లకి పొట్ట, కిడ్నీలు, కాలేయం సమస్యలు మొదలు కావచ్చు.
1. జీర్ణ సమస్యలు
2. డయేరియా
3. వికారం
4. కడుపునొప్పి
5. డీహైడ్రేషన్
ఇలా చేస్తే సేఫ్
నీళ్లను నేరుగా తాగవద్దు. కాచి చల్లార్చిన నీళ్లనే తాగండి. కాచడం కష్టమైన పని అనుకుంటే ఫిల్టర్లు వాడండి. కొన్ని ఫిల్టర్లు అన్ని రకాల లోహాలను వడపోస్తాయి. అలాంటివి వాడడం ఉత్తమం.
Also read: ఇలాంటి కలలు వస్తున్నాయంటే అర్థం మీకు అలాంటి మానసిక సమస్య ఉన్నట్టే
Also read: ప్రాణాన్ని నిలబెట్టే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, వీటితో మరిన్ని ఉపయోగాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.