అన్వేషించండి

Bathukamma Decaration : బతుకమ్మను ఏ విధంగా పేర్చాలో తెలుసా? ఉపయోగించాల్సిన పూలు ఇవే

Bathukamma Procedure : ప్రకృతి ప్రాముఖ్యతను కలర్​ ఫుల్​గా తెలియజేసే పండుగల్లో బతుకమ్మ ఒకటి. అలాంటి బతుకమ్మను ఏయే పూలతో తయారుచేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

Bathukamma Making Procedure : తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన రీజనల్ పండుగల్లో బతుకమ్మ(Bathukamma 2024) ఒకటి. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఎలాంటి పువ్వులను బతుకమ్మను చేయడంలో ఉపయోగించాలో.. ఎలా వాటిని అమర్చి బతుకమ్మను తయారు చేయాలో కొందరికి తెలియదు. బతుకమ్మను ఆర్టిఫీషియల్ వాటితో కాకుండా సహజంగా అడవులలో దొరికే పూలతో తయారు చేస్తే పర్యావరణానికి మంచిది. అయితే బతుకమ్మను పేర్చడంలో ఏయే పూలు ఉపయోగిస్తారో.. ఎలా బతుకమ్మను సిద్ధం చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పూలు ఇవే..

బతుకమ్మను తయారు చేయడానికి ప్రధానంగా గుమ్మడిపువ్వు, తంగేడు, గునుగు పువ్వులు, గుమ్మడి ఆకులు ఉండాలి. చామంతులు, బంతిపూలను కూడా ఇపయోగించవచ్చు. ఈ పూలు అందుబాటులో లేనప్పుడు ఏ పూలనైనా బతుకమ్మ కోసం ఉపయోగించవచ్చు. కానీ ప్రధానంగా ఈ పూలతోనే బతుకమ్మను తయారు చేస్తారు. ఇవే ఎందుకంటే.. వీటివల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా ఎన్నో లాభాలు ఉంటాయి కాబట్టి. అయితే బతుకమ్మను ఎలా పేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూలు పడిపోకుండా ఉండేందుకు..

మీ దగ్గర ఉన్న పూలను బట్టి మీరు బతుకమ్మ సైజ్​ని డిసైడ్ చేసుకోవాలి. లేదంటే మీరు చేయాలనుకుంటున్న దానికి తగ్గట్లు పూలను, పూలరకాలను తెచ్చుకోవాలి. బతుకమ్మను ఇత్తడి ప్లేట్​లో చేసుకుంటే మంచిది. అది అందుబాటులో లేనప్పుడు స్టీల్​ ప్లేట్​ను కూడా ఉపయోగించుకోవచ్చు. బతుకమ్మ బోర్లించిన కోన్​ రూపంలో వస్తుంది కాబట్టి.. పూలు పడిపోకుండా ఉండేందుకు దారం హెల్ప్ తీసుకోవాలి. బతుకమ్మను చేసేందుకు సరిపడా దారాన్నిముందుగా ప్లేట్​లో వేయాలి. మొత్తం బతుకమ్మను అమర్చిన తర్వాత దారాల సాయంతో కలిపి.. బతుకమ్మ చెదరకుండా పైభాగంలో కట్టాల్సి ఉంటుంది.

Also Read : బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు.. స్త్రీ శక్తిని గౌరవిస్తూ, ప్రకృతితో మమేకమై చేసుకునే  ఫెస్టివల్ ఇది

బతుకమ్మను తయారు చేసే విధానం..

ప్లేట్​, దారాలపై విస్తారకు వేయాలి. విస్తారకు ప్లేట్​లోపల సరిపోయేలా కట్ చేసుకోవాలి. దానిని నుంచి దారాలను బయటకు తీసి.. బతుకమ్మను పేర్చుకోవాలి. ఇప్పుడు విస్తరిపై గుమ్మడి ఆకులు వేయాలి. అనంతరం తంగేడు పూలను ఒక లేయర్​గా అమర్చాలి. మొగ్గలుగా ఉండే తంగేడు పూలను ఉపయోగిస్తే బతుకమ్మ మరింత నిండుగా కనిపిస్తుంది. అనంతరం గునుగుపూలను లేయర్​గా వేయాలి. ఏ పువ్వును తీసుకుని పేర్చినా.. వాటి కాడలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు బతుకమ్మ కదలకుండా ఉంటుంది. 

గుమ్మడి పువ్వును అక్కడే ప్లేస్ చేయాలి..

పువ్వులను అమర్చేప్పుడు గ్యాప్స్ వస్తే వాటి మధ్యలో గుమ్మడి ఆకులు పెట్టాలి. చామంతులు, బంతులు.. ఇతరాత్ర పువ్వులను ఉపయోగిస్తూ బతుకమ్మను శంకం ఆకారంలో పేర్చుకోవాలి. వరుసలు పెరిగే కొద్ది వెడల్పు తగ్గుతూ రావాలి. బతుకమ్మ సమయంలో వివిధ రకాల పూలు మార్కెట్​లో అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా మీరు ఉపయోగించి కలర్​ఫుల్ బతుకమ్మను తయారు చేసుకోవచ్చు. ఇలా శంఖంలా పేర్చుకున్న తర్వాత చివర్లో గుమ్మడిపువ్వును ప్లేస్ చేయాలి. గుమ్మడి పువ్వు బతుకమ్మ పై భాగంలోనే ఉండాలి. 

మొదటిసారి చేసుకునేవారైతే.. 

ఇలా బతుకమ్మను తయారు చేసుకున్న తర్వాత.. కింద ఉంచిన దారాలను పైకి లాగి.. విస్తారకు, అమర్చిన పువ్వులు కలిసి ఉండేలా పై భాగంలో కట్టాలి. ఇలా కట్టుకోవడం వల్ల బతుకమ్మ జారకుండా ఉంటుంది. ముందుగానే కావాల్సిన వస్తువులు సిద్ధం చేసుకుంటే బతుకమ్మను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొదటి సారి ప్రయత్నించేవారు చిన్న బతుకమ్మను చేసుకుంటే మంచిది. గౌరమ్మకు మొక్కిన తర్వాత.. బతుకమ్మ వేడుకలు ముగిసిన తర్వాత.. దానిని నది లేదా సరస్సులో నిమజ్జనం చేయాలి. 

Also Read : బతుకమ్మని ఎప్పటినుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఇవే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Wall Cleaning Tips: గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
గోడలపై జిడ్డు మరకలు పడ్డాయా? మీ ఇంట్లో ఉండే 3 వస్తువులతో నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కా! 
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
పాములు పాలు తాగవు కదా, మరి ఈ సామెత ఎందుకు పుట్టింది? శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోండి!
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి  
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
Embed widget