అన్వేషించండి

Bathukamma 2024 : బతుకమ్మని ఎప్పటినుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఇవే

Cultural Importance of the Bathukamma : బతుకమ్మ పండుగకు ఎందుకింత ప్రాధాన్యత ఉంది? అసలు దీనిని ఎందుకు చేసుకుంటారు? ఎప్పటి నుంచి ఈ ఫెస్టివల్​ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు?

Interesting Facts About Bathukamma : తెలంగాణలో బతుకమ్మ(Bathukamma 2024) ముఖ్యమైన పండుగ. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ ఫెస్టివల్​కు అపారమైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతలు ఉన్నాయి. అందుకే దీనిని రెస్పాన్స్​బులిటీగా తీసుకుని.. ప్రతి సంవత్సరం దీనిని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉండేవారి నుంచి.. జాబ్ చేసేవారి వరకు ప్రతి మహిళ ఈ బతుకుమ్మ వేడుకల్లో పాల్గొంటుంది. ఇంతకీ ఈ బతుకుమ్మ పండుగ చారిత్రక ప్రాముఖ్యత ఏంటి? సాంస్కృతిక ప్రాముఖ్యతలు, సాంప్రదాయాలు, ఆచారాలు ఏంటో ఇప్పుడు తెలసుకుందాం. 

కాకతీయుల కాలం నుంచే.. 

బతుకమ్మ ప్రాచీన మూలాలు పరిశీలిస్తే.. ఈ పండుగను కాకతీయ రాజవంశం నుంచి అంటే 12వ శతాబ్ధం నుంచి జరుపుకుంటున్నారు. స్త్రీ శక్తి, సంతానోత్పత్తికి ప్రతీకగా ఉండే గౌరి దేవికి ఈ సమయంలో నివాళి అర్పిస్తారు. ప్రకృతి, వ్యవసాయం ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. బతుకమ్మతో పంట సీజన్​ ప్రారంభాన్ని పోల్చుతారు. ఇవన్నీ చారిత్రక ప్రాముఖ్యతలుగా చెప్తూ ఉంటారు. బతుకుమ్మను ప్రతి సంవత్సరం పండుగను మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు. దసరాకు రెండు రోజుల ముందు ఇది ఉంటుంది. బతుకుమ్మ తర్వాత బొడ్డెమ్మ చేస్తారు. ఇది వర్ష రుతువును ముగింపును సూచిస్తుంది. 

సాంస్కృతిక ప్రాముఖ్యత

మహిళా సాధికారతకు అద్దం పట్టేలా బతుకమ్మను చేసుకుంటారు. బతుకమ్మ మహిళల ఐక్యత, బలం, సృజనాత్మకతను తెలియజేసేలా దీనిని నిర్వహిస్తారు. మహిళలందరూ కలిసి సమావేశమై.. కథనాలు పంచుకుంటున్నారు. బతుకమ్మను తయారు చేసి.. జానపద పాటలు పాడుకుంటూ.. సాంప్రదాయ కార్యక్రమాలు చేసుకుంటూ.. పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. గౌరి దేవికి నైవేద్యాలు పెడతారు. గౌరీ దేవికి పూజలు చేసి.. పువ్వులు, నైవేద్యం సమర్పిస్తారు. 

రోజుకో పేరు పెట్టి..

ఈ పండుగ రోజు మహిళలు చీరలు కట్టుకుని ట్రెడీషనల్​ లుక్​లో ముస్తాబవుతూ ఉంటారు. మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మని, రెండో రోజు అటుకుల బతుకమ్మని, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ.. నాలుగో రోజు నానినబియ్యం బతుకమ్మ అంటారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.

యునెస్కో గుర్తింపు..

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా బతుకమ్మను చేస్తారు. పువ్వులను సంతానోత్పత్తికి ప్రతీకగా ఉంచుతారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి ఈ పండుగ ప్రతిబింబిస్తోంది. ఈ బతుకమ్మ ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. యునెస్కో దీనిని సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచిస్తుంది. 

Also Read : బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు.. స్త్రీ శక్తిని గౌరవిస్తూ, ప్రకృతితో మమేకమై చేసుకునే  ఫెస్టివల్ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
హైదరాబాద్ లో భారీ వర్షం, రోడ్లపై భారీగా వరద ప్రవాహం - అర్ధరాత్రి సైతం ఓ మోస్తరుగా
Tirumala Laddu: కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
కల్తీ విషయం ఎంతగానో బాధించింది- తిరుమల లడ్డూ వివాదంపై రాహుల్ గాంధీ
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Embed widget