(Source: ECI/ABP News/ABP Majha)
వయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ రికార్డ్ క్రియేట్ చేశారు. పొలిటికల్ డెబ్యూలోనే ఊహించని రీతిలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. వయనాడ్ ఉప ఎన్నికలో గెలుపొంది ఎంపీగా పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్నారు. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ మూడున్నర లక్షల మెజార్టీతో విజయం సాధించారు. కానీ...ఆయన ఇక్కడ తన పదవికి రాజీనామా చేశారు. రాయ్‌బరేలీలోనూ గెలవడం వల్ల అక్కడే ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ రాజీనామాతో వయనాడ్‌లో ఉప ఎన్నిక తప్పలేదు. అయినా...ఈ సీట్‌ని వదులుకోడానికి ఇష్టపడని కాంగ్రెస్... ప్రియాంక గాంధీని బరిలోకి దింపింది. అనుకున్నట్టుగానే వయనాడ్..తమ కంచుకోట అని ప్రూవ్ చేసుకుంది. పైగా... రాహుల్ గాంధీ కన్నా ఎక్కువగా దాదాపు 4 లక్షల మెజార్టీని సాధించి..రికార్డ్ సృష్టించారు ప్రియాంక. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఈ స్థాయి విజయం దక్కడం ఆమె కెరీర్‌కి మంచి బూస్టప్ అయింది.
క్యాంపెయిన్ దశ నుంచే ప్రియాంక గాంధీ చాలా కూల్‌గా కనిపించారు. కచ్చితంగా గెలిచేది నేనే అన్న కాన్ఫిడెన్స్‌తో కనిపించారు. అలా అని ఎక్కడా అతిగా మాట్లాడలేదు. రాజకీయ విమర్శలూ పెద్దగా చేయలేదు. జస్ట్..వయనాడ్ అంటే తమ కుటుంబానికి ఎందుకంత స్పెషలో మాత్రమే చెప్పారు. తన చెల్లికి మద్దతుగా రాహుల్ కూడా వచ్చి ప్రచారం చేశారు. ఈ ఇద్దరూ పొలిటికల్ కామెంట్స్ ఎక్కువగా చేయకుండానే...అక్కడి ఓటర్ల సపోర్ట్‌ని గెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ప్రేమంటే ఏంటో వయనాడ్ ప్రజలే నేర్పారంటూ రాహుల్ ఇచ్చిన స్పీచ్‌లు కూడా కలిసొచ్చాయి. "మేం మీ వాళ్లం" అనే ఫీలింగ్‌ని అక్కడి ప్రజలు ఓన్ చేసుకునేలా సాగింది వీళ్లిద్దరి ప్రచారం. ఆ స్ట్రాటెజీ ఎంత సక్సెస్ అయిందో ప్రియాంకకు వచ్చిన మెజార్టీయే చెబుతోంది. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అటు రాహుల్‌తో పాటు ఇటు ప్రియాంక కూడా పార్లమెంట్‌లో అడుగు పెడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ కలిసి మోదీ సర్కార్‌ని ఎలా ఢీకొడతారన్నది