అన్వేషించండి

TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?

TGPSC Group1 Mains: తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టులకు నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.

TGPSC Group1 Mains Results: తెలంగాణలో 563 గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను టీజీపీఎస్సీ ప్రారంభించింది. ఫిబ్రవరి 19లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు.  

యూపీఎస్సీ తరహాలో నియామక ప్రక్రియ..
యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేసే విధానాన్ని గ్రూప్‌-1లో అమలు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా .. ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కమిషన్ ప్రారంభించింది. 

మొదటి ప్రాధాన్యం 'గ్రూప్-1' పోస్టులకే..
తెలంగాణలో ఇతర ఉద్యోగాలకంటే కూడా 'గ్రూప్స్' పోస్టులకు ఎక్కువగా పోటీ పడుతుంటారు. అయితే ఇటీవల నియామకాల్లో తుదిఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో, ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో చాలా మంది ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కిందిస్థాయి పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మిగిలిపోయాయి. ఇలా గురుకులాల్లోనే దాదాపు 2 వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌ కిందకు వచ్చాయి. భవిష్యత్తులో బ్యాక్‌లాగ్‌ కాకుండా ఉండేందుకు రీలింక్విష్‌మెంట్‌ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రూప్స్‌ పోస్టుల్లో అవరోహణ విధానం అమలుపై కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌-3 రాతపరీక్షలు పూర్తయ్యాయి. వచ్చేనెలలో గ్రూప్‌-2 రాతపరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్‌-1 ఫలితాలు వెలువడిన తర్వాతనే.. గ్రూప్‌-2, 3 ఫలితాలిస్తే.. బ్యాక్‌లాగ్‌ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని టీజీపీఎస్సీ భావిస్తోంది.  

గ్రూప్‌-4 అభ్యర్థులకు త్వరలో నియామక పత్రాలు..
రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలు అందిచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల వివరాలను జిల్లా, రాష్ట్రస్థాయిలో సంబంధిత విభాగాలకు టీజీపీఎస్సీ పంపించింది. దీంతో అధికారులు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ప్రారంభించారు.  వారం, పదిరోజుల్లో తుది పరిశీలన పూర్తిచేసి.. వెనువెంటనే సీఎం చేతులమీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో మొత్తం 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. అయితే వీరితోపాటు హైకోర్టు అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 7 పేపర్లు రాసిన అభ్యర్థులు 21,093 మంది ఉన్నారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేయనున్నారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. ఒకవేళ ఏమైనా తేడాలుంటే మాత్రం మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు. ఆ తర్వాత మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను రూపొందించనున్నారు. 

ALSO READ: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Indonesian Hindu Religious Rights : ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
Embed widget