Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
TGPSC: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలకు హాల్ టికెట్లను డిసెంబర్ 9 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన జారీ చేసింది.
TGPSC Announced Group 2 Hall Tickets Download Date: తెలంగాణలో గ్రూప్ 2 (Group 2) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ (TGPSC) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పరీక్షల షెడ్యుల్‌ను కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుండగా.. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పేపర్ 1, 3 పరీక్షలు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పేపర్ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మొత్తం 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇప్పటికే మూడుసార్లు వివిధ కారణాలతో పరీక్ష వాయిదా పడింది. మరోవైపు, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ముగిసిన టెట్ దరఖాస్తుల ప్రక్రియ
అటు, తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 (2) దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దాదాపు 2.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క పేపర్ - 2కే 1.55 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకూ ఎడిట్ చేసుకోవచ్చు.
ఇలా ఎడిట్ చేసుకోవాలి..
- అభ్యర్థులు https://schooledu.telangana.gov.in సైట్‌లోకి వెళ్లాలి. అందులో తెలంగాణ టెట్ - 2 లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్తగా ఓపెన్ అయ్యే విండో హోంపేజీలో Edit Application ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ జర్నల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- ఆ తర్వాత మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను మీరు ఎడిట్ చేసుకోవచ్చు.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ ఎడిట్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రింట్ అప్లికేషన్‌పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫాం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఎడిట్ ఆప్షన్‌తో ఒకసారి మాత్రమే ఎడిట్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. 2025, జనవరి 1 నుంచి పరీక్షలు ప్రారంభమై జనవరి 20తో ముగుస్తాయి. టెట్ పూర్తయ్యే సమయానికి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.