అన్వేషించండి

Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

Warangal Crime News: గూగుల్‌లో చూసి వరంగల్‌లో బ్యాంకును కొల్లగొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి చోరీ అయిన సొత్తు పరిస్థితి ఏంటీ? ఖాతాదారుల సొత్తుకు ఎవరు గ్యారంటీ ?

Warangal News: గుర్తు తెలియని వ్యక్తులంతా ఓ ముఠాగా ఏర్పడి బ్యాంక్‌ను దోపిడీ చేసే సీన్ సినిమాల్లో చూసే ఉంటారు. ఇప్పుడు అలాంటి సీన్‌లు వరంగల్‌లో ఎస్‌బీఐలో కనిపించాయి. రాత్రికి రాత్రే నలుగురైదుగురు వ్యక్తులు రెండు గంటల్లోనే బ్యాంకును లూటీ చేశారు. ఒక్క దెబ్బకు19 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ వ్యాప్తంగా కలకలం రేగింది. ఖాతాదారులు బ్యాంకులకు పరుగెత్తుతున్నారు.  

పక్కా ప్లాన్‌తో దోపిడీ

బ్యాంకులోని మూడు సేఫ్టీ లాకర్లను దుండగులు గ్యాస్ కటర్‌ను ఉపయోగించి కట్ చేశారు. అందులో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. 497 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం పోవడం సంచలనంగా మారింది. ఈ బంగారం విలువ దాదాపు 15 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంటున్నారు. అర్థరాత్రి వేళలో కారులో వచ్చి రెండు మూడు గంటల్లోనే పని పూర్తి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

కేసు ఛేదించేందుకు ఐదు బృందాలు

వరంగల్‌ జిల్లా ఎస్‌బీఐ బ్యాంకులో లూటి చేసింది ఇతర్రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఐదు బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. గతంలో ఇలాంటి చోరీలు ఎక్కడెక్కడ జరిగాయో ఆరా తీస్తున్నారు. అక్కడ లభించిన సాంకేతిక ఆధారాలతో ఇప్పుడు చోరీ చోట దొరికిన ఆధారాలతో పోల్చి చూస్తున్నారు. 

Also Read: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్

గూగుల్‌లో చూసి దోపిడీ

వరంగల్‌లో జరిగిన చోరీ కేసు విచారణ చేస్తున్న పోలీసులకు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా ముందుగా గూగల్ మ్యాప్‌లో బ్యాంకు అడ్రెస్‌లు వెతుకుంతుందని చెబుతున్నారు. పారిపోయేందుకు వీలుగా ఎలాంటి జనసంచారం లేని ప్రాంతంలో ఉన్న బ్యాంకులనే టార్గెట్ చేస్తారు. అలాంటివి సెలెక్ట్ చేసుకొని రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం దోపిడీ చేస్తారు. ఇప్పుడు రాయపర్తి బ్యాంకు విషయంలో అదే జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

రాయపర్తి ఎస్బీఐలో చోరీ జరగడంతో ఖాతాదారులు ఉలిక్కిపడ్డారు. భారీగా జనం బ్యాంకుకు వస్తున్నారు. తమ సొత్తు ఏమైందో అని ఆరా తీస్తున్నారు. భద్రంగా ఉంటాయని కొందరు ఇక్కడ దాచుకుంటారని ఇలాంటివి జరిగితే ఎక్కడ భద్రత ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొత్తు పోయిందనే భయం వద్దని దీనికి తగ్గట్టు బీమా సౌకర్యం ఉంటుందని చోరీకి గురైన బంగారం డబ్బులు వస్తాయని అధికారులు ధైర్యం చెబుతున్నారు.  

ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి
బ్యాంకులో చోరీ, అగ్న ప్రమాదం జరిగి దాచుకున్న సొత్తు పోతే ఆప్రైజర్ విలువ కట్టిన పత్రాలు ఆధారంగా వంద శాతం బీమా సౌకర్యం లభిస్తుంది. అది కూడా ఇప్పటి మార్కెట్ ధర ప్రకారం చెల్లిస్తారు. 

బ్యాంకులకు సంబంధించిన ప్రతి శాఖకు అక్కడ జరిగే లావాదేవీలను బట్టి ఏటా బీమా సౌకర్యం చేయిస్తారు. 

వ్యక్తిగత లాకర్లలో పెట్టే సొత్తుకు మాత్రం ఖాతాదారులదే బాధ్యత. అందులో ఏం ఉంచుతారనేది మాత్రం బ్యాంకు అధికారులు చూడరు కాబట్టి వాటికి బ్యాంకుకు సంబంధం ఉండదు. 

Also Read: ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget