
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Andhra News: కర్నూలు జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ బాలునికి రంగు పూసి ఎర్రటి ఎండలో భిక్షాటన చేయిస్తోన్న వీడియో వైరల్ అయ్యింది. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి బాలుని రక్షణకు ఆదేశాలిచ్చారు.

Minister Lokesh Responded To A Netizen Tweet On The Incident Of Child Begging In Kurnool: కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే సమాజంలో మానవత్వం ఉందా.? అనే అనుమానం కలుగుతుంది. అలాంటి ఘటనే కర్నూలు (Kurnool) నగరంలో తాజాగా చోటు చేసుకుంది. నిండా పదేళ్లు కూడా నిండని బాబుకు రంగు పూసి ఎర్రటి ఎండలో కూర్చోబెట్టి భిక్షాటన చేయిస్తోన్న ఉదంతం ఆందోళన కలిగించింది. బాలుడిని తీవ్రంగా కొట్టి.. ఒంటిపై రంగు పూసి రహదారిపై ఓ ముఠా భిక్షాటన చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎండకు తాళలేక బాలుడు అల్లాడిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. ఈ తతంగాన్ని అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. చిన్నారులతో ఇలాంటి పనులు చేయిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్పందించిన మంత్రి లోకేశ్
This is heartbreaking. Every child deserves safety, love, and dignity. We will locate this child and ensure he receives the protection and care he needs. Those responsible for abusing him will be held accountable. @OfficeofNL https://t.co/hwEEQVTcS4
— Lokesh Nara (@naralokesh) November 20, 2024
ఓ నెటిజన్ ఈ వీడియోను మంత్రి నారా లోకేశ్‌కు (Nara Lokesh) ట్వీట్ చేసి బాలుడిని రక్షించాలంటూ కోరారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటూ వారిని ఆదేశించారు. 'ఇది హృదయ విదారక ఘటన. ప్రతి బిడ్డ.. భద్రత, ప్రేమ, గౌరవానికి అర్హుడు. మేము ఈ చిన్నారిని గుర్తించి, అతనికి అవసరమైన రక్షణ, సంరక్షణ అందేలా చూస్తాము. అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతాం.' అని తెలిపారు.
Also Read: Konaseema News: అమ్మాయికి మెస్సెజ్ చేశాడని చితకబాదేసి దారుణం, కోనసీమలో ఇంత కోపమా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

