ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులున్న ప్రైవేటు కంపెనీ వాల్ మార్ట్ - అమెరికాకు చెందిన ఈ కంపెనీలో 21 లక్షల మంది ఉద్యోగులున్నారు.



ప్రపంచంలో అత్యధిక మంది ఉద్యోగులున్న రెండో కంపెనీ అమెజాన్ - ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 15 లక్షల 25 వేలు



తైవాన్‌కు చెందిన ఫాక్స్ కాన్ గ్రూపు ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంటుంది - ఫాక్స్ కాన్ ఉద్యోగుల సంఖ్య 8 లక్షల 26 వేలు



ఐర్లాండ్‌కు చెందిన ఆక్సెంచర్ కంపెనీది నాలుగో స్థానం - మొత్తం ఉద్యోగుల సంఖ్య 7 లక్షల 74 వేలు



జర్మనీకి చెందిన ఆటోమోబైల్ దిగ్గజం వోక్స వ్యాగన్ ఐదో స్థానంలో ఉంది - ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6 లక్షల 56వేలు



మన దేశానికి చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆరో స్థానంలో ఉంది - టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6 లక్షల పైనే



జర్మనీకి చెందిన డుశ్చే గ్రూప్ ఏడో స్థానంలో ఉంది - డీహెచ్ఎల్‌గా పిలిచే ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5 లక్షల 94 వేలు



చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ బీవైడీ ఎనిమిదో స్థానంలో ఉంది - BYD ఉద్యోగుల సంఖ్య 5 లక్షల 70 వేలు



అత్యధిక మంది ప్రైవేటు ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో మనది ఒక్క టీసీఎస్ మాత్రమే ఉంది - మిగతా కంపెనీలేవీ ప్రపంచ స్థాయికి చేరలేదు !