రెజ్యూమ్‌లో చాటభారతాలు వద్దు. రొటీన్ స్టేట్‌మెంట్లు వద్దు. మీ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ వర్క్, కాన్ఫిడెన్స్ కనిపించేలా సింపుల్‌గా రెండు పేజీల్లో ఉంటే చాలు



మీ క్యాంపస్‌లో మీరు ఏ కంపెనీ ఇంటర్యూకు వెళ్తున్నారో ఆ కంపెనీ గురించి సమగ్ర సమాచారం తెలుసుకోండి



టీమ్ వర్క్‌లో పని చేస్తూ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ కు తడబడకుండా పరిష్కారం చెప్పాలి.



టెక్నికల్‌గా సబ్జెక్ట్ విషయంలో మరీ ప్రతిభా ప్రదర్శన చేయాలని ఎక్కువ చెప్పేయకండి. వారు ఆఫర్ చేస్తున్న రోల్ కు ఎంత అవసరమో అంతే చెప్పండి.



ఒక వేళ వారు అడిగిన ప్రశ్నకు సమాధానంపై డౌట్ ఉన్నా కాన్ఫిడెంట్ గా అదే చెప్పండి



ఉద్యోగం విషయంలో షరతులు పెట్టడానికి ప్రయత్నించకండి. ఫలానా చోట పని చేస్తానని మరికొన్ని చోట్ల అయితే జాయిన్ అవనని చెప్పకండి.



మీ నిజాయితీని ప్రశ్నించడానికి టాపిక్ తో సంబంధం లేని ప్రశ్నలు అడగవచ్చు. తెలియకపోతే ఖచ్చితంగా తెలియదని చెబితే అది మైనస్ కాదు!



కొత్తగా ఇంటర్యూలకు వెళ్తూంటారు. అదేదో యుద్ధం అని అనుకోకుండా..సాధారణ సంభాషణగానే భావించండి. బిగుసుకుపోకండి !



ప్లేస్‌మెంట్ ఇంటర్యూలు జాబ్ కోసం మాత్రమే కాదు అది భవిష్యత్‌లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించే మొదటి మెట్టుగా భావించండి .