పీరియడ్స్ సమయంలో స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు డార్క్ చాక్లెట్ తింటే మంచిదట. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలందుతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో. దీనిలోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయట. డార్క్ చాక్లెట్లోని మెగ్నీషియం క్రాంప్స్ని, మూడ్ స్వింగ్స్ని దూరం చేస్తుంది. నొప్పిని దూరం చేసి.. శరీరంలో ఫీల్ గుడ్ ఎండార్ఫిన్లను రిలీజ్ చేస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. నొప్పిని దూరం చేసే వాటిలో డార్క్ చాక్లెట్ ముందు వరుసలో ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే క్రాంప్స్ని డార్క్ చాక్లెట్ తగ్గిస్తుందని అధ్యయనం కూడా తెలిపింది. నొప్పిని తగ్గిస్తుందని ఎక్కువగా కాకుండా.. రోజుకు 30 నుంచి 60 గ్రాముల చాక్లెట్ని తినవచ్చు. ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కూడా పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని దూరం చేస్తాయి. ఇవి అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.