క్వైట్ ఫైరింగ్ అంటే ఏంటి? - ప్రైవేట్ ఉద్యోగుల్లో టెన్షన్ టెన్షన్! ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల్లో క్వైట్ ఫైరింగ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ పద్ధతిలో బాస్ మిమ్మల్ని ఉద్యోగులని ఉద్యోగంలో నుంచి తీసేయరు. కానీ వారే రాజీనామా చేసేలా పరిస్థితులను సృష్టిస్తారు. ముఖ్యమైన మీటింగ్స్, డిస్కషన్లకు తీసేయాలనుకున్న వారిని అస్సలు పిలవరు. వారి ఐడియాలు, సజెషన్లకు అస్సలు ప్రాముఖ్యత ఇవ్వరు. చేయడానికి పని ఇవ్వరు. బాధ్యతలు కూడా బాగా తగ్గించేస్తారు. దీంతో ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి, ఇన్‌సెక్యూరిటీ ప్రారంభం అవుతాయి. దీని వల్ల ఉద్యోగుల ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం దెబ్బ తింటాయి. దీన్ని అవాయిడ్ చేయాలంటే ఉద్యోగులకు వారి హక్కులు తెలియాలి.