కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే ఆసీస్‌కు ఝలక్ తగిలింది. మిచెల్ స్టార్క్ చాలాసేపు భారత బౌలర్లను అడ్డుకొన్నాడు. హేజిల్‌వుడ్ తో కలిసి పదో వికెట్‌కు విలువైన రన్స్ రాబట్టాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు లాస్ట్ ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్టార్క్ భారీ షాట్‌కు యత్నించాడు. రిషభ్ పంత్ అద్భుతమైన క్యాచ్‌తో అతను పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. దీంతో భారత్‌కు 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఉస్మాన్ ఖావాజా 8, మెక్‌స్వీనీ 10, లబుషేన్ 2, స్టీవ్ స్మిత్ డకౌట్, ట్రావిస్ హెడ్ 11, మిచెల్ మార్ష్ 6, అలెక్స్ కేరీ 21, కమిన్స్ 3, నాథన్ లైయన్ 5 పరుగులు చేశారు. ఫైనల్ గా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 150 పరుగులుగా ఉంది.