AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే పైచేయి, సెకండియర్‌లో అబ్బాయిలు కొంచెం బెటర్
AP Inter Results 2025 Pass Percentage: ఏపీలో నేడు విడుదలైన ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలు పైచేయి సాధించారు. అబ్బాయిలతో పోల్చితే అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు.

Andhra Pradesh Intermediate Result | ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాలలో, సెకండియర్ ఫలితాలలో అధిక ఉత్తీర్ణత శాతం సాధించారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో గత 10 పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కాగా. ఫస్టియర్ లో 70% శాతం పాస్ కాగా, రెండో సంవత్సరంలో 83% మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
బాలురు 80 శాతం, బాలికలు 86 శాతం..
రెండో సంవత్సరం పరీక్షలకు 2,03,904 మంది బాలురు హాజరుకాగా, 1,62,952 మంది పాసయ్యారు. వీరి పాస్ శాతం 80 కాగా, అమ్మాయిలు 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2,18,126 మంది బాలికలు సెకండియర్ పరీక్షలు రాయగా, 1,88,569 మంది పాసయ్యారు.
ఇక ఒకేషనల్ విషయానికొస్తే 13,710 మంది బాలురు రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు కాగా, 9236 మంది పాసయ్యారు. వీరి ఉత్తీర్ణత శాతం 67 కాగా, బాలికలు 84 శాతం మంది పాసయ్యారు. 19,579 బాలికలు ఎగ్జామ్ రాయగా, 16,471 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫస్టియర్‌లో బాలురు 66, బాలికలు 75 శాతం..
ఇంటర్ ఫస్టియర్‌లో 2,38,107 మంది బాలురు ఎగ్జామ్ రాయగా, 1,56,258 మంది పాసయ్యారు. వీరి ఉత్తీర్ణత శాతం 66 శాతం కాగా, బాలికలు 75 శాతం మంది పాసయ్యారు. 2,49,188 మంది బాలికలు ఫస్టియర్ ఎగ్జామ్స్ రాయగా, 1,86,721 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫస్టియర్ ఒకేషనల్ లో 15,968 మంది బాలురు ఎగ్జామ్ రాయగా, 7966 మంది మాత్రమే పాసయ్యారు. వీరి ఉత్తీర్ణత శాతం 50 కాగా, అమ్మాయిలు 71 శాతం పాసయ్యారు. 22,585 మంది అమ్మాయిలు ఎగ్జామ్ రాయగా, 16,025 మంది పాసయ్యారని అధికారులు తెలిపారు.






















