Telangana Government Jobs 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర- ఏ శాఖలో ఎన్ని ఖాళీలు అంటే?
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్లకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఆర్థిక శాఖ అనుమతులు మంజూరుతో ఆయా డిపార్టమెంట్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి.
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగులు ప్రిపరేషన్ ప్రారంభించేశారు. న్యాయసమస్యలు లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇంతోనే ఆర్థిక శాఖ గుడ్‌న్యూస్ చెప్పేసింది.
తెలంగాణ వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి వాటికి అనుమతి ఇచ్చింది ఆర్థిక మంత్రిత్వ శాఖ. 30వేల 453 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖాళీల వివరాలు చూస్తే...
టీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్‌వన్ ఉద్యోగాలు- 503
పోలీసు శాఖలో ఉద్యోగాలు-16, 587
పై ఉద్యోగాలను టీఎస్ ఎల్‌పీఆర్‌బీ ద్వారా భర్తీ చేస్తారు.
టీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోలీసు ఉద్యోగాలు - 231
టీఎస్ ఎల్‌పీఆర్‌బీ ద్వారా భర్తీ జైళ్ల శాఖలో ఉద్యోగాలు- 154
టీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే జైళ్లు శాఖలో ఉద్యోగాలు- 31
రవాణా శాఖలో భర్తీ కానున్న ఉద్యోగాలు- 63( వీటిని టీఎస్ ఎల్‌పీఆర్‌బీ ద్వారా భర్తీ చేస్తారు.)
టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేసే రవాణా శాఖలో ఉద్యోగాలు 149
ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ద్వారా భర్తీ చేసే వైద్యారోగ్య శాఖలో ఖాళీలు- 10, 028
టీఎస్‌పీఎస్పీ ద్వారా భర్తీ చేసే వైద్యారోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాలు- 2,662
డీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే హెల్త్, మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలో ఉద్యోగాలు- 45
వీటిలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 3,576 ఉద్యోగాలు భర్తీ అయితే... టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ద్వారా 16, 804 పోస్టులు, ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ ద్వారా 10,0028 ఖాళీలు, డీఎస్సీ ద్వారా 45 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
గ్రూప్ వన్ ఖాళీలను చూసుకుంటే...
జిల్లా బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - ఐదు
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ పోస్టులు - 40
అసిస్టెంట్ ట్రజరీ ఆఫీసర్ ఖాళీలు -38
పాలనాధికారుల సంఖ్య -20
డీఎస్పీలు- 91
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్-8
జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్-2
జిల్లా మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్-6
మున్సిపల్ కమిషనర్ (గ్రూప్2)- 35
MPDO -121
జిల్లా పంచాయత్ రాజ్ ఆఫీసర్- 5
CTO- 48
డిప్యూటీ కలెక్టర్- 42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌్-26
డిస్ట్రిక్ట్ రిజిస్టార్- 5
డిస్ట్రిక్ సోషల్ వెల్పేర్ ఆఫీసర్-3
రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్-4
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్-2
30,453 పోస్టులకు
— Jagan Patimeedi (@JAGANTRS) March 23, 2022
ఆర్థిక శాఖ అనుమతి !
శాఖల వారీగా జీవోలు విడుదల చేసిన
ఆర్థిక శాఖ!
80,039 ఉద్యోగాలకు గాను,
తొలి విడతగా 30,453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ! @TelanganaCMO @KTRTRS