Zydus Cadila's Covid Vaccine: పిల్లలకు శుభవార్త.. త్వరలోనే కొవిడ్ వ్యాక్సిన్.. లైన్లో రెండు టీకాలు!
పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని దేశమంతా ఎదురుచూస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో రెండు పిల్లల కొవిడ్ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అందులో ఒకటి జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేస్తోన్న జైకోవ్-డీ కాగా మరొకటి భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కొవాగ్జిన్. అయితే ఇవి ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
జైకోవ్-డీ వ్యాక్సిన్‌ను పిల్లల కోసం అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఆదేశించింది. కొవాగ్జిన్ మాత్రం క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని డీజీసీఐ అనుమతి కోసం వేచి చూస్తోంది.
అయితే జైడస్ క్యాడిలా మాత్రం జైకోవ్-డీ వ్యాక్సిన్ వేగంగా ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్ పిల్లలకు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
జైడస్ క్యాడిలా వ్యాక్సిన్..
జైడస్ క్యాడిలా తయారు చేస్తోన్న జైకోవ్-డీ 12 ఏళ్ల వయసు పైబడినవారికి ఇవ్వనున్నారు. ఈ మేరకు అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతిచ్చింది. అనుమతి పొందిన వెంటనే కంపెనీ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించింది. అయితే ధర విషయంపైనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
డెసిషన్ పెండింగ్..
భారత్ బయోటెక్ తయారు చేసి కొవాగ్జిన్ వ్యాక్సిన్ 2-18 ఏళ్ల వయసు వారు వేసుకోవచ్చు. నిపుణుల కమిటీ ఈ నివేదికను డీసీజీఐకి పంపింది. ప్రస్తుతం డీసీజీఐ అనుమతి కోసం కొవాగ్జిన్ ఎదురుచూస్తోంది.
వచ్చే ఏడాదే..
అన్ని అనుమతులు వచ్చి వ్యాక్సిన్ పిల్లలకు అందేటప్పటికీ వచ్చే ఏడాది అవుతుందని సమాచారం. ఈ విషయాన్నే కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ కూడా పరోక్షంగా తెలిపారు.
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!