Stroke cases increasing globally :భవిష్యత్‌లో మరిన్ని స్ట్రోక్ మరణాలు.. స్మోకింగ్‌తో సమానంగా వాయు కాలుష్య మరణాలు.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు
Stroke cases increased : భవిష్యత్‌లో మరిన్ని స్ట్రోక్ మరణాలు సంభవించే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. స్మోకింగ్‌తో సమానంగా వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది అంటున్నారు. షాకింగ్ విషయాలు ఇవే..
![Stroke cases increasing globally :భవిష్యత్‌లో మరిన్ని స్ట్రోక్ మరణాలు.. స్మోకింగ్‌తో సమానంగా వాయు కాలుష్య మరణాలు.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు Stroke cases increasing globally, air pollution, high temperatures driving numbers Stroke cases increasing globally :భవిష్యత్‌లో మరిన్ని స్ట్రోక్ మరణాలు.. స్మోకింగ్‌తో సమానంగా వాయు కాలుష్య మరణాలు.. తాజా నివేదికలో షాకింగ్ విషయాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/19/e80a48d32b050fa2f1d56ab323e3ea6817267175133691097_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stroke cases increased globally : ప్రస్తుత జీవనశైలి సహా పర్యావరణపరమైన సమస్యల కారణంగా.. స్ట్రోక్ మరణాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోగ్య శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు, అత్యధిక రక్తపోటు వంటి మెటబాలిక్ సమస్యలతో పాటు ఫిజికల్‌గా ఏ పనీ చేయకపోవడమే మరణాలకు ప్రధాన కారణాలని తెలిపింది. లాన్సెట్ న్యూరాలజీ జర్నల్‌లో దీనిగురించి ప్రచురించారు. పొగ తాగే వారితో సమానంగా వాయు కాలుష్యం బారిన పడి చనిపోతుండడం.. పర్యావరణపరంగా జరుగుతున్న మార్పులను ఓ హెచ్చరికగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతలతో పాటే పెరుగుతున్న స్ట్రోక్ మరణాలు
1992 నుంచి ఇప్పటి వరకూ చోటుచేసుకున్న గుండె సంబంధిత మరణాలు పరిశీలిస్తే.. భూతాపంతో పాటే స్ట్రోక్ మరణాలు 72 శాతం పెరిగాయని పరిశోధన పత్రం వెల్లడించింది. పర్యావరణ పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోక పోతే భవిష్యత్‌లో ఈ మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పొగ తాగేవారిలో కలిగే బ్రెయిన్ బ్లీడ్ వంటి దుష్పరిణామాలు.. వాయు కాలుష్యం కారణంగానూ చోటు చేసుకుంటున్నట్లు మొట్టమొదటి సారి GBD పరిశోధన బయట పెట్టింది. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ సాయంతో జీబీడీ ఈ పరిశోధనను వివిధ ప్రాంతాల్లో చేపట్టింది. 1990లతో పోల్చితే 2021 నాటికి మొదటి సారి స్ట్రోక్‌కు గురైన వారి సంఖ్య 70 శాతం మేర పెరిగి కోటీ 19 లక్షలకు చేరింది. ఈ స్ట్రోక్‌తో సంభవించే మరణాల సంఖ్య 1990లతో పోల్చితే 44 శాతం పెరిగి 73 లక్షలకు చేరినట్లు జీబీడీ పరిశోధన పత్రం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా, గుండెకు బ్లడ్ షార్ట్ సప్లై వల్ల కలిగే మరణాల తర్వాత అత్యధిక మరణాలు ఈ స్ట్రోక్‌కు సంబంధించినవే. ఈ మరణాల్లో నాలుగింట మూడొంతుల మరణాలు స్వల్ప, మధ్యాదాయ దేశాల్లోనే ఎక్కువగా జరగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ మరణాల ఉద్ధృతి చూస్తుంటే స్ట్రోక్ కట్టడికి ప్రపంచ దేశాలు తీసుకున్నట్లు చర్యలు సరిపోవడం లేదన్న విషయాన్నిగుర్తు చేస్తున్నట్లు పరిశోధలో పాల్గొన్న శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుత పాపులేషన్‌కు అనుగుణంగా మరిన్ని చర్యల అవసరాన్ని సూచిస్తున్నారు.
1990లతో పోల్చితే ఇప్పుడే అత్యధికంగా హెల్తీలైఫ్ లాస్
అధిక బరువు, ఎయిర్ పొల్యూషన్, అధిక రక్తపోటు, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం, స్మోకింగ్ వంటి కారణాలతో ప్రస్తుత ప్రపంచం 135 మిలియన్ ఇయర్స్ హెల్తీ లైఫ్‌ను మొత్తంగా కోల్పోతున్నట్లు పరిశోధన తెలిపింది. 1990లో ఇది 100 మిలియన్ ఇయర్స్ మాత్రమే ఉందని తెలిపిందిచ. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా పరిస్థితులు ఈస్ట్రన్ యూరోఫ్‌తో పాటు ఆసియా, సబ్ సహరన్ ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నాయి.
ప్రాసెస్డ్ మీట్, కూరగాయలు సహా ఎయిర్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేయగలిగితే మరణాల సంఖ్యను భారీగా తగ్గించవచ్చని సూచించారు. స్ట్రోక్ సర్వైవలెన్స్ ప్రోగ్రామ్స్‌ను పెంచాలని.. ప్రజలు తీసుకుంటున్న ఆహారంపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టి వారికి మంచి డైట్ అందేలా చూడాలని సూచించారు. ఆయా దేశాల్లో నమోదవుతున్న ఈ స్ట్రోక్ కేసుల ఆధారంగా ఆయా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని.. గ్లోబల్ స్థాయిలో కూడా ఆయా వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తేనే భవిష్యత్‌లో సంభవించబోయే కోట్లాది స్ట్రోక్ మరణాలను సమర్థంగా అడ్డుకోగలమని నివేదిక స్పష్టం చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)