News
News
X

పొట్ట క్లీన్ అవ్వాలా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

పొట్ట క్లీన్ అవ్వడం అంటే పేగులు శుభ్రపరచుకోవడమే. దానికి చక్కని చిట్కాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

రోజూ స్నానంతో శరీరాన్ని శుభ్రపరుచుకున్నట్టే, పొట్టను శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టనెలా క్లీన్ చేసుకుంటామని ఆలోచిస్తున్నారా? ఆయుర్వేదంలో కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చాలు పొట్ట క్లీన్ అయిపోతుంది. పొట్ట అంటే ఆహారం జీర్ణమయ్యే పెద్ద పేగులు, చిన్న పేగులు కలిపే. పెద్ద పేగుల్లోనే ఎక్కువ ఆహారం జీర్ణమవుతుంది. కాబట్టి వాటిని శుభ్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీర్ణ వ్యవస్థ ఆధారపడిందే పెద్ద పేగుపైన. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక ఏడాది క్రితం తిన్న ఆహారం తాలూకు ముక్కలు ఇంకా పెద్ద పేగు మూలల్లో ఎక్కోడో దగ్గర ఇరుక్కుని ఉంటాయి. వాటిని కూడా ఏరిపడేసే విధానాల గురించి ఆయుర్వేదం వివరిస్తోంది. 

శంఖ ప్రక్షాళన
ఇది చిన్న, పెద్ద ప్రేగులను శుభ్రపరిచే పాత టెక్నిక్. దీన్ని ఖాళీ పొట్టతో ఉదయానే చేయాలి. ఇందుకోసం పది గ్లాసుల గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగేయాలి. ఈ నీటిని తీసుకునేటప్పుడు లోతైన శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ నీరు తాగాక సింపుల్‌గా ఉండే యోగసనాలు వేయాలి. ఇలా శారీరక శ్రమ చేయడం వల్ల పేగుల్లో కదలిక ఉంటుంది. పేగుల మూలల్లో ఉన్న వ్యర్థాలు కూడా మలం ద్వారా బయటికి పోతాయి. 

పీచు ఆహారం
ఆహారంలో పీచు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మసాలాలు, నూనెలు దట్టించిన ఆహారాన్ని రోజూ తినడం వల్ల పేగుల్లో వ్యర్థాలు చేరుతాయి. పీచు నిండిన కూరగాయలను ఉడికించి తినాలి. అలాగే పండ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి కొన్నిరోజుల పాటూ తీసుకోవడం వల్ల పేగులు  శుభ్రపడతాయి. ఆ సమయంలో మాంసం, తీపి, కారం, మసాలాలు వేసిన పదార్థాలు తినకూడదు. 

హైడ్రేషన్
వ్యాధులను నయం చేయడానికి నీరు చాలా అవసరం. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు తినడానికి 30 నిమిషాల ముందు, భోజనానికి ఒక గంట తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగాలి.  అలా చేయడం వల్ల పేగు సరైన పనితీరు మెరుగుపడుతుంది. పేగులను డిటాక్స్ చేయాలంటే మజ్జిగ, నిమ్మరసం తాగాలి. ఇది శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తుంది, అదే సమయంలో పెద్ద పేగులను కూడా శుభ్రపరుస్తుంది.

ప్రోబయోటిక్స్
ప్రోబయోటిక్స్ కలిగి ఉన్న పెరుగులాంటి పదార్థాలు పేగుల ఆరోగ్యానికి చాలా అత్యుత్తమ ఆహారం. లాక్టోబాసిల్లస్ ఎంజైమ్ అపానవాయువు, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యల వంటి అన్ని సమస్యలను నివారిస్తుంది. 

Also read: BF.7 వేరియంట్ సూపర్ ఫాస్ట్, ఒకరి నుంచి పద్దెనిమిది మందికి సోకే అవకాశం - మరో లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉండాలా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 24 Dec 2022 10:44 AM (IST) Tags: Ayurvedam Tips Stomach Cleanse Tips for Stomach clean

సంబంధిత కథనాలు

పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి

పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు, ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలను పాటించండి

Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి

Eyes: కళ్లు పొడిబారిపోతున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కాలతో సాంత్వన పొందండి

Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

Cough: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి

Cough: దగ్గుతో బాధపడుతుంటే కేవలం 10 నిమిషాల్లో ఇలా సిరప్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి

Constipation: మలబద్దకంతో ముప్పుతిప్పలు పడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి

Constipation: మలబద్దకంతో ముప్పుతిప్పలు పడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం