అన్వేషించండి
Benefits of Eating Raw Garlic Before Bed : రాత్రుళ్లు పచ్చి వెల్లుల్లి తినొచ్చా? ఆ సమస్యలుంటే మాత్రం కచ్చితంగా తీసుకోవాలట
Nighttime Garlic Consumption : వెల్లుల్లి వంటలకు మంచి రుచిని అందిస్తుంది. అందుకే దీనిని వివిధ వంటల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిని రాత్రుళ్లు తినొచ్చా?

వెల్లుల్లితో కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇవే(Images Source : Envato)
1/9

వెల్లుల్లి రెబ్బలను రోజు ఓ రెండు తింటే.. ముఖ్యంగా రాత్రి తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏమిటో నిపుణుల సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
2/9

గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లి శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లైజెరిడ్స్ని తగ్గించి.. హృదయ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
3/9

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గించి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం ఇస్తాయి.
4/9

బీపీ ఉన్న వారు రెగ్యూలర్‌గా దీనిని తీసుకుంటే మంచిది. ఇది రక్తంలో ప్రెజర్‌ని తగ్గించి.. మెరుగైన రక్తప్రసరణ అందిస్తుంది. దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది.
5/9

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు స్కిన్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు.. ఆర్థ్రరైటిస్ని కూడా తగ్గేలా చేస్తాయి.
6/9

వెల్లుల్లిలోని ప్రోబయోటిక్ లక్షణాలు మెరుగైన జీర్ణ వ్యవస్థను అందిస్తాయి. కడుపు ఉబ్బరం, వివిధ రకాల గ్యాస్ సమస్యలను కంట్రోల్ చేసి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
7/9

ముఖ్యంగా వెల్లుల్లిని రాత్రుళ్లు తీసుకుంటే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నిద్ర సమస్యతో ఇబ్బంది పడేవారు దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.
8/9

ఇది శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. చెడు కొవ్వు పేరుకుపోకుండా హెల్తీగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల పింపుల్స్ కూడా రావు. స్కిన్ క్లియర్‌గా ఉంటుంది.
9/9

ఆరోగ్యానికి మంచిది కదా అని దీనిని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి. రోజుకు ఒకటి లేదా రెండు రెబ్బలు మాత్రమే తీసుకోవాలి. ఈ రోటీన్ని ఫాలో అయ్యే ముందు నిపుణులు, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.
Published at : 27 Aug 2024 12:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion