Sridevi Drama Company : బుల్లెట్ భాస్కర్‌ను అన్నయ్యా అని పిలిచిన హీరోయిన్ - అసలు విషయం తెలిసి షాకైన వేణు!
ప్రతి ఆదివారం ప్రేక్షకులకు అలరించే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఈ వారం మరింత ఫన్ పంచబోతోంది. తాజాగా ప్రోమోలో కంటెస్టెంట్ల స్కిట్లు, హీరో వేణు, హీరోయిన్ రేఖ చేసిన సందడి అందరినీ అలరించాయి.
ఎప్పటిలాగే ఈ వారం కూడా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ బుల్లితెర ప్రేక్షకులకు మరింత ఆహ్లాదాన్ని పంచబోతోంది. ఆదివారం నాడు ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ ప్రోమో ఫుల్ ఫన్ తో నిండిపోయింది. కంటెస్టెంట్ల కామెడీ, స్పెషల్ గెస్టుల ఫన్ తో ఆహ్లాదంగా మారిపోయింది. ప్రోమో మొదలుకాగానే సద్దాం టీమ్ కనిపిస్తుంది. ఆయన చేసిన స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తాడు. కడాయిలో కోడికి బదులుగా రింగ్ రియాజ్ ను వేశారని చెప్పడంతో షో అంతా నవ్వులతో నిండిపోతుంది. ఇక జబర్దస్త్ వర్ష, జోర్దార్ సుజాత తమ హోటళ్లోకి కస్టమర్లను ఆహ్వానించేందుకు చేసే ప్రయత్నాలు ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తాయి. ఇందుకోసం వాళ్లు ఏకంగా శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ తో ఎంటర్ టైన్ షో చేయాలనుకోవడం ఆసక్తికలిగిస్తోంది. ఈ సందర్భంగా రష్మి, ఇంద్రజ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటుంది.
'బుల్లెట్ భాస్కర్'ను అన్నయ్యా అన్న రేఖ
తెలుగు తెరపై ఒకప్పుడు సందడి చేసిన రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas) ఈ షోకు స్పెషల్ గెస్టుగా వచ్చింది. ఈ సందర్భంగా 'బుల్లెట్' భాస్కర్ ను ''అంకుల్ ఎవరు నువ్వు?'' అని వర్ష అడుగుతుంది. రేఖను చూపిస్తూ ''ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్'' అని చెప్తాడు. ''అన్నయ్యా ఇలా మాట్లాడకూడదు'' అని రేఖ అనడంతో సిగ్గుతో పక్కకు వెళ్లిపోతాడు. ఇక రేఖ చాలా బలహీనంగా కనిపించడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక వినయ విధేయ రామ సినిమాలో హీరోయిన్ కియార కాళ్లను పట్టుకుని తన భుజం మీదకు రామ్ చరణ్ లేపినట్లుగా మీద లేపాలని యాదమ్మ రాజు, బుల్లెట్ భాస్కర్లకు టాస్క్ ఇస్తారు. ఈ సందర్భంగా వాళ్లు పడే పాట్లు అందరినీ నవ్విస్తాయి.
Read Also : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డౌట్స్ తీర్చిన హరీష్ శంకర్
శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై వేణు సందడే సందడి
డిజిటల్ మీడియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న హీరో వేణు ఈ షోలో సందడి చేశారు. ఇక ఆయనతో బుల్లెట్ భాస్కర్ చెప్పే ఆసక్తికర విషయం అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. మీరు చెప్పినట్లుగానే పెళ్లి చేసుకున్నాను. ముగ్గురు అమ్మాయిలను చూశాను. ఇద్దరు అమ్మాయిలను ఇష్టపడ్డాను. ఒక అమ్మాయిని ప్రేమించాను. నలుగురు అమ్మాయిలను చేసుకున్నాను అని చెప్తాడు. ఆయన చెప్పే విషయాన్ని విని వేణు షాక్ అవుతాడు. ఫైనల్ గా ఎవరినీ చేసుకోలేదు, హ్యాపీగా ఉన్నాడు అని చెప్తాడు అనుకున్నాను అని వేణు చెప్పగానే అందరూ నవ్వుతారు. ఇక వేణుతో కలిసి షోలోని అమ్మాయిలు చేసే సందడి అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు గెస్టుగా వచ్చారా? స్వయంవరానికి వచ్చారా? అని బుల్లెట్ భాస్కర్ అనడంతో చిరునవ్వుతో వచ్చానని వేణు చెప్పడం అందరినీ నవ్విస్తుంది. ఇక అమ్మాయి గొంతుతో పాటలు పాడుతూ కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుర్రాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా పాటలు పాడుతూ అలరించాడు. ఈ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ సెప్టెంబర్ 17న ప్రసారం కానుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial