జూనియర్ ఐశ్వర్యగా పేరొందిన స్నేహా ఉల్లాల్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? అయితే... నెక్స్ట్ ఫోటోలు చూడండి. సల్మాన్ ఖాన్ 'లక్కీ' సినిమాతో స్నేహా ఉల్లాల్ కథానాయికగా హిందీ తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో స్నేహా ఉల్లాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తెలుగులో మంచు మనోజ్ సరసన నటించిన 'నేను మీకు తెలుసా?' ఆమెకు పెద్ద హిట్. సుశాంత్ 'కరెంట్', బాలకృష్ణ 'సింహ' సినిమాల్లో కూడా స్నేహా ఉల్లాల్ హీరోయిన్ గా నటించారు. ఐశ్వర్యగా అయితే స్నేహా ఉల్లాల్ పేరు తెచ్చుకున్నారు. కానీ, ఆ స్థాయిలో అవకాశాలు రాలేదు. జూనియర్ ఐశ్వర్యగా తనకు గుర్తింపు వచ్చింది గానీ ఛాన్సుల కోసం నటిగా తాను కష్టపడ్డానని ఓ సందర్భంగా స్నేహా చెప్పారు. 'అల్లరి' నరేష్ 'యాక్షన్ త్రీడీ', 'అంతా నీ మాయలోనే' తర్వాత స్నేహా ఉల్లాల్ తెలుగులో సినిమాలు చేయలేదు. స్నేహా ఉల్లాల్ (all images courtesy : snehaullal / Instagram)